# ప్రభుత్వ పాఠశాలల్లో జిల్లా కలెక్టర్
ఆకస్మిక సందర్శన..
నర్సంపేట,నేటిధాత్రి :
అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి, సుందరికరణ పనులు జూన్ 10వ తేదీలోగా పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం నర్సంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి నాణ్యతతో నిర్దిష్ట గడువులోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కొరకు నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామంలోని మహేశ్వరి పరమేశ్వరి సహకార పరపతి సంఘంచే తయారు చేస్తున్న ఏకరూప దుస్తుల తయారీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి దుస్తులను పరిశీలించారు.ఈ సందర్భంగా టీఎల్ ఎఫ్ లు నిర్వహిస్తున్న రికార్డులను , సైజులవారిగా దుస్తుల ఆర్డర్ తీసుకున్న, ఏకరూప దుస్తులను తయారుచేసి అందించిన వివరాలను పరిశీలించారు.ఇప్పటికే మహిళ సంఘాల ద్వారా 50 శాతం ఏకరూప దుస్తులను కుట్టించి సంబంధిత ప్రధానోపాధ్యాయులకు అందించడం జరిగిందని జూన్ 10వ తేదీలోగా మొత్తం ఏకరుప దుస్తులు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి ట్రైనీ ఐఎఫ్ఎస్ రేవంత్ చంద్ర, డిఆర్డిఓ కౌసల్య దేవి, మండలం నోడల్ అధికారులు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.