Development Works Begin in Kothaguda Village
గ్రామం లో అభివృద్ధి పనులు ప్రారంభం
కొత్తగూడ, నేటిధాత్రి:
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మేజర్ గ్రామ పంచాయతీ లో
నాడు పిల్లలతో… నేడు ప్రజలతో…. మొదలైన అభివృద్ధి పనులు
అందరూ నావాళ్లంటూ అభివృద్ధిపై.. మక్కువ చూపుతున్న నూతన సర్పంచ్ గా ప్రమాణం స్వీకరించి 24 గంటలు గడవకముందే అభివృద్ధి పనులు చేపట్టిన ..వార్డు సభ్యులు మీ వార్డులో ఉన్న సమస్యను నా దృష్టికి తీసుకురావాలి వెంటనే పరిష్కరించాలి లేదా మీ బాధ్యతే
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం లో ని నూతన సర్పంచ్ గా ప్రమాణస్వీకారం చేసిన24 గంటలు గడవక ముందే అభివృద్ధి పనులపై తనదైన మార్క్ చాటిన మేజర్ గ్రామపంచాయతీ కొత్తగూడ నూతన సర్పంచ్ మల్లెల భాగ్యమ్మ… సంక్షేమ గురుకుల పిల్లలకు తానే తల్లిగా నిలిచిన భాగ్యమ్మ… నేడు ప్రజా సమస్యలపై వార్డ్ వారిగా నేరుగా సమస్యలు తెలుసుకుంటూ వారి సమస్యలు తీర్చేవిధంగా అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగింది.ప్రభుత్వ ఉద్యోగం లో… ప్రజా ఉద్యోగంలో తనదైనా మార్క్…చూపించారాని గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ మల్లెల రణధీర్, ఉప సర్పంచ్ కంగాల శేఖర్, వార్డ్ సభ్యులు వార్త రాజు, సాయి ప్రియా తదితరులు పాల్గొన్నారు..
