– *ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వివిధ మండలాల
మొగుళ్లపల్లి / టేకుమట్ల
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని మొగుళ్లపల్లి, టేకుమట్ల మండలాల్లోని పలు గ్రామాలల్లో రూ.1.47 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపనలు చేశారు.
రెండు మండలాల్లోని వివిధ గ్రామాల వారీగా పనుల వివరాలు:
– మెట్టుపల్లి గ్రామంలో రూ.22 లక్షల70 వేలతో పెద్ద చెరువు మరమ్మత్తు పనులకు శంకుస్థాపన చేశారు.
– పెద్దకోమటిపల్లి గ్రామంలో రూ.25 లక్షల 75వేలతో పెద్ద చెరువు మరమ్మత్తు పనులకుశంకుస్థాపన చేశారు.
– సుబ్బక్కపల్లి గ్రామంలో రూ.5 లక్షలతో ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.
– సోమనపల్లి గ్రామంలో రూ.22 లక్షల 25వేలతో తాళ్లకుంట మరమ్మత్తు పనులకు శంకుస్థాపన చేశారు.
– పెద్దంపల్లి గ్రామంలో రూ.10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
– గర్మిళ్లపల్లి గ్రామంలో రూ.3 లక్షల 95 వేలతో అంబేద్కర్ కమ్యూనిటీ భవన ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
– వెల్లంపల్లి గ్రామంలో రూ.10 లక్షల 82 వేలతో ఊర చెరువు మరమ్మత్తు పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆయా గ్రామాలల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ… గ్రామాలల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులతో పాటు అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చూస్తానని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమాలల్లో జెడ్పిటిసిలు పులి తిరుపతిరెడ్డి జోరుక సదయ్య నాయకులు, తక్కలపల్లి రాజు ఎర్రబెల్లి పున్నం చందర్రావు పోల్నేని లింగారావు అధ్యక్షులు ఆకుతోట కుమార్ స్వామి కోటగిరి సతీష్ మంద సాంబయ్య అధికారులు పాల్గొన్నారు.