మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని పెద్ద రేవల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని, నవాబుపేట మండలంలోని ఊరంచుతాండాలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని నేడు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, కష్టాలను తప్పించుకునే జీవించడం కాదు వాటిని అధిగమించడమే నిజమైన గొప్పతనం. కష్టపడి పనిచేసే వారికి అవకాశాలు వాటి అంతటా అదే వెతుక్కుంటూ వస్తాయి అన్నారు. అవకాశం ఆకాశం నుండి రాదు, అరచేతి గీతల్లో ఉండదు అని, అలసిపోని గుండెల్లో ఉంటుంది, అంతులేని పట్టుదలతో మాత్రమే ఉంటుందని, విజయం అంటే ఎక్కువ పనులు చేయడం కాదు, విజయం అంటే సరైన పనులు చేయడం అని కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరోసారి గుర్తుకు చేశారు. ఈ కార్యక్రమంలో నవాబుపేట మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలుపాల్గొన్నారు.