https://epaper.netidhatri.com/view/305/netidhathri-e-paper-29th-june-2024%09
`ఏపిలోనే తిరుపతి నెంబర్ వన్ చేస్తా.
To view this news in English please click on the below link
`తిరుపతి పట్టణం సుందరీకరిస్తా.
`అంతర్జాతీయ నగరం సరసన నిలబెడతా!
`తెలుగు దేశం పార్టీ అంటే నాకు ప్రాణం.
`సీఎం. చంద్రబాబు నాయుడు రాజకీయ దైవం.
`మంత్రి లోకేష్ నాయకత్వం ఇష్టం.
`పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తా.
`లోకేష్ పాదయాత్రకు సమన్వయ కర్తగా పని చేశా.
`150 మంది వాలంటీర్లతో పాదయాత్రను సమన్వయం చేశా.
`18 నెలల పాటు లోకేష్ పాదయాత్రలో కొనసాగా.
`వైసిపి నిర్భంధాలను ఎదుర్కొన్నాను.
`57 కేసులు నమోదు చేశారు.
`అడుగడుగునా అడ్డుకున్నారు.
`వైసిపి నేతలు భయపెట్టారు. బెదిరించారు.
`ఆర్థిక మూలాలు దెబ్బ తీశారు.
`అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు.
`ఎన్ని రకాలుగా వేధించాలో అన్నీ చేశారు.
`నేను అదరలేదు…బెదరలేదు.
`తెలుగుదేశం జెండా వీడలేదు.
`ఎక్కడికీ పారిపోలేదు.
`తెగించి నిలబడ్డాను.
`పార్టీ కోసం ప్రాణాలు పణంగా పెట్టాను.
తిరుపతిని గొప్పగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమంటున్న యువ నాయకుడు..తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర తెలుగు
యువత కార్యక్రమాల కో-ఆర్డినేటర్ ’’అనిమిని రవి నాయుడు’’, ‘‘నేటిధాత్రి ఎడిటర్’’ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’తో పంచుకున్న విషయాలు ఆయన మాటల్లోనే…
హైదరాబాద్,నేటిధాత్రి:
నాకు తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణప్రదం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాకు రాజకీయ దైవం. మంత్రి లోకేష్ నాయకత్వం ఆదర్శం. ఆయనంటే ఎంతో ఇష్టం. గౌరవం. నా పార్టీకి, వారి నాయకత్వానికి జీవితాంతం సేవ చేయడమే నా కర్తవ్యం. బాద్యత. ఐదేళ్ల కాలం పాటు ఎన్నొ ఒడిదొడుకులు ఎదుర్కొన్నాను. పార్టీని నా వంతు శక్తి వంచన లేకుండా కాపాడడంలో కృషి చేశాను. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. అందుకు ఎంతో సంతోషించాను. నాకు తిరుపతి అర్భన్ డెవలప్ మెంటు చైర్మన్ పదవి ఇస్తే తిరుపతిని అన్ని రంగాలలో అధ్భుతంగా తీర్చిదిద్దుతా…ఇది ఎంతో ఆత్మవిశ్వాసంతో, తిరుపతి మీద తనకున్న ప్రేమతో, అనుబంధంతో చెబుతున్నాను. తనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ అవకాశం కల్పిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే తిరుపతిని ఒక అద్భుతమైన పట్టణంగా రూపొందిస్తా…ఏపిలోనే నెంబర్ నగరంగా తీర్చిదిద్దేందుకు అహర్నిషలు కృషి చేస్తా…తిరుపతి నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దుతా..అత్యంత సుందరమైన నగరంగా సుందరీకరిస్తా…అంతర్జాతీయ నగరాల సరసన నిలబెడతా…ఆ నమ్మకం నాకుంది. ఐదేళ్ల వైసిపి నిర్భంధ పాలనలో ప్రాణాలకు తెగించి తెలుగుదేశం జెండాను రెపరెపలాడిరచిన నాయకుల్లో ముందు వరసులో వున్నాను. ఈ ఐదేళ్ల కాలంలో ఏనాడు నిర్భంధాలనైనా లెక్క చేయలేదు. ఎవరికీ భయపడిరది లేదు. నాపై వైసిపి ప్రభుత్వం ఎన్ని కేసలు నమోదు చేసినా బెదిరిపోలేదు. అదిరిపోలేదు. అడుగడుగునా వైసిపి నేతలు చేసిన బెదిరింపులకు భయపడలేదు. నిత్యం వైసిపి నేతలు అదిరించినా పారిపోలేదు. వైసిసిని ధైర్యంగా ఎదిరించాను. వైసిసికి వ్యతిరేకంగా పోరాటాలు చేశాను. అనేక ఉద్యమాలు చేపట్టాను. యువత పక్షాన పోరాటం చేశారు. తెలుగుదేశం పిలుపునిచ్చిన అనేక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాను. నాడు వైసిసి సృష్టించిన అడ్డంకులన్నీ చేధించుకుంటూ ఏపి మొత్తం పార్టీ బలోపేతం కోసం అనేక పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నాను. దాదాపు ఏపి మొత్తం అనేక ప్రాంతాల్లో కేసులు నమోదైనా సరే వైసిపి మీద పోరాటం ఆపలేదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్ధితులను కూడా మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొన్నాను. అలాంటి నేను పార్టీ అధికారంలోకి రావడంతో తిరుపతి అర్భన్ డెవలప్ మెంటు చైర్మన్ పదవి ఇస్తే చేపట్టాలని, తిరుపతిని గొప్ప నగరంగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తనపై నమ్మకం వుంచి ఆ పదవి ఇస్తారని ఆశిస్తున్నానంటున్న తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు అనిమిని రవి నాయుడుతో నేటిధాత్రి ఎడిటర్ కట్టారాఘవేంద్రరావుతో పంచుకున్న ఆసక్తి కరమైన విషయాలు ఆయన మాటల్లోనే…
పార్టీని మళ్లీ నిలబెట్టాల తెలుగుదేశం శ్రేణులందరూ అనుకున్నట్లే నా వంతు కృషి చేశాను.
తెలుగుదేశం జెండా తెలుగునాట ఎరగరాలని తాపత్రయపడ్డాను. మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, ఆయన స్వర్ణయుగ పాలన సాగాలని, నవ్యాంధ్ర రూపు దిద్దుకోవాలని కోరుకున్నాను. అందుకే లోకేష్ నాయకత్వం కోసం ముందడుగు వేశాను . అడుగడుగునా ఎదురౌతున్న అవాంతరాల దాటుకుంటూ వెళ్లాను. అనేక అవమానాలు భరించాను. వేధింపులు తట్టుకున్నాను. ఇటు అను నిత్యం ఐదేళ్లపాటు అనునిత్యం ఏదో ఒక రూపంలో పోరాటం చేశాను. అటు లోకేష్ పాదయాత్ర విజయవంతం కోసం నిర్విరామ కృషి చేశాను. ఐదేళ్లపాటు అష్టకష్టాలు ఎదురైనా ఓర్చుకున్నాను. గుండె నిబ్బరంతో తెలుగుదేశం జెండా రెపరెపలాడిరచడంలో ముందున్నాను. తెలుగుదేశం పార్టీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుందని బలంగా నమ్మిన వారిలో నేను ఒకడిని. పార్టీని నా కుటుంబంకంటే ఎక్కువగా ప్రేమించాను. భవిష్యత్తు తెలుగుదేశందే అని క్యాడర్‌లో ఆత్మవిశ్వాసం నింపాను. వారిలో ఆశలు చిగురింపజేశాను. క్యాడర్‌కు ధైర్యం నూరిపోశాను. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, అమరావతి రాజధానితో తెలుగు నేల పులకించి పోవాలని అకుంఠిత దీక్షతో పనిచేశాను. పార్టీ కోసం మూడు సంవత్సరాల పాటు కఠోరశ్రమ చేశాను. పార్టీ కోసం అహర్నిషలు పనిచేశాను. పద్దెనమిది నెలలు కుటుంబాన్ని కూడా చూడకుండా పార్టీకోసం పనిచేశాను. తెలుగుదేశం పార్టీ సైనికుడిగా కర్తవ్య దీక్షా దక్షతను నిర్వర్తించాను. తెలుగుదేశం పార్టీకి క్రియాశీలకంగా పనిచేస్తున్నాను. తెలుగుదేశం పార్టీకి చెందని విద్యార్ధి విభాగంలో మొదలైన విద్యార్ది రాజకీయ ప్రస్దానం తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నాను. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర వాలెంటీర్ కోఆర్డినేటర్‌గా లోకేష్ మన్ననలు పొందాను. సుమారు 120 మంది కోఆర్డినేటర్లతో కలిసి లోకేష్ పాదయాత్రను విజయవంతం చేసేందుకు నా వంతు కృషి చేశాను.
కేవలం లోకేష్ పాదయాత్ర సమయంలోనే నా మీద వైపిపి ప్రభుత్వం 8 కేసులు నమోదు చేసింది.
గత ఐదేళ్ల కాలంలో సుమారు 57 కేసులు నమోదు చేశారు. అలిపిరి పోలీస్ స్టేషన్‌లో 11 కేసులున్నాయి. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో 9, తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో 4, తిరుచానూరులో 6, చంద్రగిరిలో 4, చిత్తూరులో 2,గూడూరులో 2, తూళ్లూరులో 2, తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో 7, విజయవాడ సిటీ సత్యనారాయణ పురంలో 1, పెద్దకాకానిలో 1, శ్రీకాకుళంలో 1, రేణిగుంటలో 2, గాజుల మాండ్యంలో 1, శ్రీకాళహస్తి టౌన్‌లో 2, పుంగనూరులో 1, వెంకటగిరిలో ఒకటి, నాయుడు పేటలో 1 ఇలా కేసులు ఎదుర్కొన్నాను. నారాలోకేష్ యువగళంలో భాగంగా నమోదైన కేసులు వివరాలు తిరుపతిలో మూడు పోలీస్‌స్టేషన్లలో కలిసి 3 కేసులు, నూజివీడులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, ఉంగటూరు నియోజకవర్గం నిడమర్రులో హత్యాయత్నం కేసు, భీమవరంలో 2 హత్యాయత్నం కేసులు, ఆదోనిలో ఒక కేసు నమోదు చేశారు. ఇలా నా మీద కేసులు నమోదు చేసి, ఇబ్బందులకు గురిచేశారు. నా ఆర్ధిక మూలాలు దెబ్బతీయాలని కుట్ర చేశారు. ఆ ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం మీద దెబ్బ కొట్టాలని చూశారు. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు అనేక ఉద్యమాలు, పోరాటాలు చేశాను. గత ప్రభుత్వాన్ని అడుగడుగునా ఎదుర్కొన్నాను. ఉద్యోగ నోటీఫికేషన్ల కోసం నేను చేసిన పోరాటం సంచనలం సృష్టించింది. జగన్ కల్తీ మద్యం మీద అనేక పోరాటాలు చేశాను. ఏపిలో మత్తు, మాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టాలని ఉద్యమాలను చేశాను. యువత మత్తుకు బానిసలు కావొద్దని అనేక చైతన్య కార్యక్రమాలు చేపట్టాను. అప్పటి ప్రభుత్వంపై విరుచుకుపడేవారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాననిచెప్పి జగన్ మోసం చేయడాన్ని ఎండగడుతూ అనేకసార్లు ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించాను. యువ ఓటర్లలో చైతన్యం నింపే కార్యక్రమాలు అనేకం చేపట్టాను.
ఓటు విలువ, కొత్తగా ఓటరు నమోదు వంటి అనేక కార్యక్రమాలలో విసృతంగా పాలుపంచుకున్నాను.
యూనివర్సిటీ విద్యార్దులకు సదస్సులు నిర్వహించాను. సామాజిక సేవ కార్యాక్రమాలు అనేకం చేపట్టాను. .గత ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో డిగ్రీ పట్టాలతో పల్లిపొట్లాలు కట్టుకోవాలా? అంటూ అనేక నిరసన క్యార్యక్రమాలు చేపట్టాను. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి, ప్రజలకు మళ్లీ చేరువ కావడానికి కృషిచేశాను. అలాంటి నాకు తిరుపతి అర్భన్ డెవలప్ మెంట్ అధారిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, లోకేష్ నాయకత్వానికి తోడుగా నిలుస్తూ, భవిష్యత్తు తెలుగుదేశం పార్టీని కంచుకోటలా మార్చేందుకు నిరంతరం కృషి చేస్తాను. భవిష్యత్తులో తిరుపతిలోనే కాదు, ఏపిలో తెలుగుదేశం పార్టీకి ఎదరు లేకుండా, మరింత పటిష్ట పర్చేందుకు దోహడపడతాను. తుడా చైర్మన్‌గా నాకు అవకాశం కల్పిస్తే ఏపిలోనే ది బెస్ట్ సిటీగా తిరుపతిని తీర్చిదిద్దేందుకు అహర్నిషలు కృషి చేస్తాను . పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు అని ప్రకటించిన సిఎం. చంద్రబాబు నాయుడు తనను పరిగణలోకి తీసుకోవాలని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను.