నిర్వహణ పనులు(ఈఈ)కి అప్పగించవద్దు
ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ డిమాండ్
హన్మకొండ, నేటిధాత్రి:
ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ గతంలో మేడారం జాతర పనులు అవినీతి అక్రమాలకు పాల్పడిన ఎటునాగారం గిరిజన శాఖలో పనిచేస్తున్న , (ఈఈ) , నీ తొలగించాలని సంబంధిత గిరిజన శాఖ అధికారులకు మరియు ఐటిడిఓ పీవో గార్లకు గిరిజన సంఘాలు ప్రజాసంఘాల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చినప్పటికీ కూడా అధికారులు స్పందించకపోవడం బాధాకరమని అన్నారు.
2024 తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద గిరిజన జాతర నిర్వహణ అభివృద్ధి పనులు మళ్లీ సంబంధిత అవినీతి అక్రమాలకు పాల్పడిన గిరిజన శాఖ పనిచేస్తున్న (ఈఈ) గార్లకు అప్పగిస్తే మళ్లీ నాణ్యత నియమాలు పాటించకుండా పనులు చేయిస్తారని అన్నారు.
కావున సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి గిరిజన శాఖ పనిచేస్తున్న ఈఈ పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు.
లేని పక్షాన విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని అన్నారు
ఈ కార్యక్రమంలో ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు బానోత్ ప్రవీణ్ నాయక్ ఎల్ హెచ్ పిఎస్ జిల్లా అధ్యక్షుడు అజ్మీర వెంకన్న నాయక్ ప్రశాంత్ వినోద్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.