ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి
చొప్పదండి ఎమ్మెల్యే శ్రీ సుంకె రవిశంకర్
బోయినిపల్లి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సూచించారు.నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని అన్నారు.స్థానిక బిడ్డను ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్న.ఎన్నికల ముందు వచ్చి ఎన్నికల తరువాత వెళ్ళే నాయకుల గురించి ప్రజలకు తెలియజేయాలి. ఈ కార్యక్రమంలో కన్నం సాగర్, మల్లారపు చందు, నాగరాజు, ప్రవీణ్, రోమాల శ్రీనివాస్, వేణు, చంద్రయ్య, రవి, ప్రసాద్, బి.ఆర్.ఎస్ నాయకులు పాల్గొన్నారు.