అభివృద్ధి,సంక్షేమం బీఆర్ఎస్ తోనే సాధ్యం ఎమ్మెల్యే చల్లా

గులాబీదండులోకి కొనసాగుతున్న చేరికల పర్వం

నడికూడ,నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి,సంక్షేమం బి.ఆర్.ఎస్.తోనే సాధ్యమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలియజేశారు.మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్,బిజెపి పార్టీలకు చెందిన 100 మందికి పైగా ఆయా పార్టీలకు రాజీనామా చేస్తూ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరగా వారికి కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ బీ.ఆర్.ఎస్ ప్రకటించిన మేనిఫెస్టో ప్రతిపక్షాల్లో గుబులు మొదలైందన్నారు.ఆసరా పింఛన్లు రూ.3వేలకు పెంపు, వికలాంగుల పింఛన్ రూ.6వేలకు పెంపు, ప్రతి మహిళకు రూ.3 వేల పింఛన్, 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి రూ.15లక్షలకు పెంపు, రైతు బంధు 16 వేల రూపాయలకు పెంపు, తెల్ల రేషన్ కార్డు గల ప్రతి ఒక్కరికి సన్నబియ్యంతో పాటు 5 లక్షల బీమా సౌకర్యం మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అమలవుతాయన్నారు. గత పాలకుల హయాంలో పరకాల అభివృద్ధికి నోచుకోలేదని,గడిచిన 9 ఏండ్లలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచామన్నారు. రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని,పరకాలలో సైతం గులాబీ జెండా ఎగరడం ఖాయమ‌న్నారు.దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసి పేదల జీవితాల్లో వెలుగులను నింపారన్నారు. కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, 60 గ్యారంటీలు ఇచ్చినా చెయ్యికి ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. సంక్షేమం, అభివృద్ధి బారాసతోనే సాధ్యమన్నారు.
పార్టీలో చేరిన వారు కిన్నెర కుమారస్వామి,సిఎచ్ రాజుకుమార్,రాజు,రెడ్డి రవీందర్,కిన్నెర రాజు,సిఎచ్ వెంకటేశ్వర్లు,జంగిలి శ్రీకాంత్,కిన్నెర సూరయ్య,గోనెల శ్రీను,ఆకుల కళ్యాణ్,కిన్నెర నాగరాజు,తాళ్ల సమ్మయ్య,ఈర్ల సమ్మయ్య,కిన్నెర సారయ్య,గొడిశాల రామకృష్ణ,కిన్నెర దేవేందర్,సంపత్,కేశవ్,ఆలేటి సుభాష్,అల్లి పరమేష్,కిన్నెర రాజకుమార్,గోపగాని రాజు,తాళ్ల సమ్మయ్య,గోనెల మహేష్,తాళ్ల దేవేందర్,గోనెల రాజేందర్,అల్లం యాకయ్య,బోగీని రాజయ్య,తాళ్ల రమేష్,కుక్కలా రమేష్,రావుల రాజు,తాళ్ల రాజు,తాళ్ల సారంగం,కిన్నెర అంజి,ఎం రాజు,జగన్నాదుల జంపయ్య,బుర్ర శ్రీను,కిన్నెర ప్రశాంత్,ఈర్ల మధుకర్,కిన్నెర కుమారస్వామి లతో పాటు 50 మందికి పైగా చేరారు.
ఈ కార్యకమంలో సర్పంచ్ ఊర రవీందర్ రావు,ఉప సర్పంచ్ కిన్నెర మని, సొసైటీ డైరెక్టర్ ఊర సతీష్ రావు,ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షులు వీర్ల మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *