అభివృద్ధి చేసినం.. మరోసారి ఆశీర్వదించండి…

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లి గ్రామం

వేములపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారంలో గండ్ర వైశాలి రెడ్డి…

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 14

నిర్విరామంగా ప్రజా శ్రేయస్సుకై కృషి చేస్తున్న బీఆర్‌ఎస్‌ వైపే ప్రజలందరూ మొగ్గు చూపుతున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి గారి కోడలు గండ్ర వైశాలి రెడ్డి అన్నారు. వేములపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామ మహిళలు మగళహరతులతో ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్బంగా గండ్ర వైశాలి రెడ్డి మాట్లాడుతూ…

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారని తెలిపారు.ఈ దేశంలో జరగని అభివృద్ది తెలంగాణలో జరిగిందన్నారు. ఏ రాష్ట్రాల్లో అమలు కానీ సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని తెలిపారు.ఇతర రాష్ట్ర ప్రజలు సీఎం కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందు ఉంచి రాామరాజ్యం తెచ్చిన నాయకుడు గండ్ర వెంకటరమణారెడ్డి అత్యధిక మెజారిటీతో విజయం అందించాలని కోరారు.

ఈనెల 30వ తారీఖున ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేసి గండ్ర వెంకటరమణ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ గెలిపించాలని కోరారు

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి జోరుక సదయ్య , మండల పార్టీ అధ్యక్షులు బల్కూరు తిరుపతి రావు చిట్యాల మార్కెట్ చైర్మన్ కొడారీ రమేష్ యాదవ్ , వైస్ ఎంపీపీ రాజేశ్వరరావు ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు మంద సుధాకర్, మార్కెట్ డైరెక్టర్ ముడుపు రవీందర్ ,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి , పర్లపల్లి గ్రామ సర్పంచ్ జోరుక ప్రేమలత, గ్రామ అధ్యక్షులు అరెల్లి రమేష్, సొసైటీ డైరెక్టర్ బొద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కో ఆప్షన్ నెంబర్ మహమ్మద్ రహీం, మరియు బిఆర్ఎస్ నాయకులు ,కార్యకర్తలు, మహిళలు ,పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *