ఊరూరా స్వాగతం పలుకుతున్నప్రజలు.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
గుర్తూను గుర్తుంచుకో రామక్క.. కారును గుర్తుంచుకో..రామక్క…
కారు గుర్తుకే మన ఓటు.
అంటూ ఏ గల్లీకి వెళ్లినా మైకులు, నినాదాలు హోరెత్తుతున్నాయి. గులాబీ శ్రేణులు వీధుల్లో ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి.
భూత్పురు మండలం శేర్పల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ పార్టీ కారుగుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి ఆల వెంకటేశ్వర్ రెడ్డి ,మాజీ మంత్రి వర్యులు పి చంద్ర శేఖర్ ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా అభ్యర్థి ఆల మాట్లాడుతూ
నిరుపేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తునట్లు చెప్పారు.
కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు నమ్మి మోస పోవద్దని, ఎన్నికలు కాకముందే ఆ పార్టీలో ముఖ్యమంత్రి పీఠం కోసం కొట్లాట మొదలైందన్నారు.
అంతర్గత కుమ్ములాటలే కాంగ్రెస్ సంస్కృతని, ఎన్నికలోచ్చినప్పుడే ప్రజలు గుర్తుకు వస్తారని విమర్శించారు. ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేస్తున్న కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.