డిగ్రీ విద్యార్థులకు డిటెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి

ఏ. ఐ.ఎస్.బి రాష్ట్ర నాయకులు హకీమ్ నవీద్ డిమాండ్

హన్మకొండ, నేటిధాత్రి:

నూతనంగా కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు రెండు సెమిస్టర్ లకు 50 శాతం సబ్జెక్టులు పాస్ కావాలని నిబంధనలను విరమిచ్చుకోవాలని ఏ. ఐ.ఎస్.బి రాష్ట్ర నాయకులు హకీమ్ నవీద్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ పాలకవర్గం అనాలోచిత విధానాల వల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో నెట్టి వేసే పరిస్థితి ఏర్పడిందని ఆయనే ఆవేదన వ్యక్తం చేశారు, తక్షణమే వి.సీ గారు ఈ అంశంపై పునరాలోచించి విద్యార్థుల భవిష్యత్తు దృశ్య డి టెన్షన్ విధానాన్ని రద్దు చేయాల్సిందిగా అయినా డిమాండ్ చేశారు, లేనియెడల ఉద్యమాలను ఉద్రిత్తం చేస్తామని అయినా హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!