బంధం చెరువు మత్తడి ధ్వంసం.. వృధాగా పోతున్న నీరు

మత్తడిని ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని రైతుల ఆందోళన

శాయంపేట నేటిధాత్రి:

హన్మకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తి బంధం చెరువును పట్టించుకోని అధికారులు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి చెరువులు కుంటలు ప్రధాన ఆధారం. కాబట్టి గట్లకానిపర్తి బందం చెరువుకు మత్తడి ఉంది ఈ మత్తడి పై లేయర్ ప్రతీ వర్షాకాలం ఊడిపోతు బందం చెరువులో నీరు వృధాగా పోతుంది ఇట్టి విషయం నీటి పారుదల శాఖ వారు మరియు గ్రామ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు ఈ చెరువు మత్తడి సరిగా ఉంటే వేసవి కాలంలో కూడా తూము ల ద్వారా వేల ఎకరాల్లో వరి పంటలు వెల్లదీసుకోవచ్చు రైతులు బందంచెరువు ఎండిపోతే పంటలు పండవని పంటలు ఎండిపోతావని ఏ అధికారులు పట్టించుకోకపో వడంతో రైతులు కొంతమంది వలుగుల ప్రభాకర్, అనంతుల అశోక్, మోరె నాగరాజు, ఐలి వెంకటేశ్వర్లు, నరెడ్ల అఖిల్, లక్కర్సు కవిరాజు లు కలిసి గత సంవత్సరం స్వచ్చందంగా సొంత ఖర్చుల తో మట్టి పోసి మరమ్మతులు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చెరువు లోకి ఏమైనా నీరు చేరుకుందో చూద్దామని స్థానిక రైతులు వలుగుల ప్రభాకర్ మరికొందరు కలిసి వెళ్లి చూడగా కొద్ది రోజుల క్రితం మంచిగానే ఉన్న మత్తడి ప్రదేశం ధ్వంసం అయి కనిపించే సరికి చూడడానికి వచ్చిన రైతులు కంగుతిన్నారు ధ్వంసం చేసిన వారిని గుర్తించి తగిన శిక్ష విధించింది గత ప్రభు త్వాలు చేయలేని పనులు ఈ ప్రభుత్వం ఇకనైనా అధికారులు పట్టించుకోని చెరువు మత్తడి కట్టిస్తే బాగుంటుందని రైతులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *