Desini Rajesh Elected as Adavi Srirampur Congress President
అడవి శ్రీరాంపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షునిగా దేశిని రాజేశం ఎన్నిక
ముత్తారం :- నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు మరియు టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుదిల్ల శ్రీను బాబు ఆదేశాల మేరకు ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ ఆధ్వర్యంలో అడవి శ్రీరాంపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన శాఖ అధ్యక్షుడిగా దేశిని రాజేశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.కమాన్‌పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల రాజయ్య, ముత్తారం మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు వాజీదు పాషా, గ్రామ సర్పంచ్ అన్నపూర్ణ ఉపేందర్, ఉప సర్పంచ్ అనవేనా హరిత తిరుపతి, వార్డు సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకుల సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నూతన అధ్యక్షుడు దేశిని రాజేశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేయాలని, గ్రామంలో కాంగ్రెస్‌ను మరింత బలపడేలా చేయాలని సూచించారు.
