
భద్రాచలం నియోజక వర్గ దళితులను దగా చేస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
దళిత కుటుంబాలకు 12 లక్షల రూపాయల అభయ హస్తం ఇవ్వాలి
బిఆర్ఎస్ చర్ల మండల కన్వీనర్ దొడ్డి తాతారావు
నేటిధాత్రి చర్ల
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నియోజకవర్గంలో దళిత బంధు ఇస్తుంటే భద్రాచలం నియోజక వర్గంలోని దళితులకు దళిత బంధు ఎందుకు అమలు చేయడం లేదని బిఆర్ఎస్ చర్ల మండల కన్వీనర్ దొడ్డి తాతారావు అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన నియోజక వర్గంలో దళిత బంధు యూనిట్లను విడుదల చేస్తుంటే భద్రాచలం నియోజక వర్గంలోని దళిత కుటుంబాలకు దళిత బంధు ఇవ్వడానికి ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు భద్రాచలం నియోజక వర్గంలో దళితులు అనేక దుర్భర పరిస్థితులు జీవనం సాగిస్తున్నారని అందూన చర్ల మండల కేంద్రంలోని దళితులు దయనీయ పరిస్థితుల్లో జీవిస్తున్నారని చర్ల మండల కేంద్రంలోని దళితులను ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలం నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని ఈ ప్రాంత దళితులందరికీ అంబేద్కర్ అభయాహస్తం 12 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేనియెడల బిఆర్ఎస్ పార్టీ తరఫున భారీ ఎత్తున దళిత కుటుంబాలతో ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని అన్నారు