
Kanarani Hostel Warden.
బీసీ హాస్టల్లో అద్వాన పరిస్థితులు – ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు
# కుక్కల,పందులు స్వైర విహారం.
# కానరాణి హాస్టల్ వార్డెన్.
#పౌష్టికాహారం లో గుడ్లు లేనట్టే నా…?
# నిద్రా వస్తలో సంబంధిత శాఖ
మహదేవపూర్ జూలై 19 నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్ పూర్ మండల కేంద్రంలోనీ బీసీ హాస్టల్ నిర్వహణ అద్వాన పరిస్థితిలో ఉందని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బెల్లంపల్లి సురేష్ ఒక ప్రకటనలో శనివారం రోజున అన్నారు. మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ ను ఈరోజు ఉదయం సందర్శించగా చిత్రమైన పరిస్థితులు కనిపించాయి. హాస్టల్లో ఒక పక్కన కుక్కలు మరో పక్కన పందులు స్వైర విహారం చేస్తూన్నాయి హాస్టల్ లోనీ స్థానాల గదులు సరిగా లేక నీరు అందక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. విద్యార్థుల ఆరోగ్యం పట్ల హాస్టల్ వార్డెన్ కనీస బాధ్యత తీసుకోకపోవడం హాస్టల్ చుట్టూ విపరీతమైన చెట్లపొదలు అలుముకొని ఉన్నాయి. అదే కాకుండా మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం లో భాగంగా పిల్లలకు గుడ్లు ఇవ్వమంటే పంపిణీ చేయనిది నేను ఎలా ఇవ్వాలని అంటున్నారని విద్యార్థులు చెప్పడం గమనార్ధం. ఇప్పటివరకు పిల్లలకు గుడ్లు కూడా పెట్టకపోవడం చాలా బాధాకరమయిన దుస్థితని ఇలాంటి హాస్టల్ లో మండల అధికారులు వారంలో ఒకసారి అయిన తనిఖీ చేసి వాస్తవిక పరిస్థితులను తెలుసుకుంటే హాస్టల్ లు బాగుపడతాయని అన్నారు అదే కాకుండా నిర్లక్ష్యం వహిస్తున్న బీసీ హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బెల్లంపల్లి సురేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువసేన మండల అధ్యక్షులు మంతెన రవితేజ పాల్గొన్నారు.