
దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా నర్సంపేటలో ప్రదర్శన
4లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలి
ఎంసిపిఐ (యు),ఏఐసిటియు నాయకులు
నర్సంపేట,నేటిధాత్రి:
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ ల ను వెంటనే రద్దు చేయాలని దేశవ్యాప్తంగా కార్మికవర్గం చేపట్టిన సార్వత్రిక సమ్మెకు ఎం సిపిఐ (యు),ఏఐసిటియు సంపూర్ణ మద్దతు తెలిపింది.దీంతో నర్సంపేట పట్టణంలోని ప్రధాన రహదారులపై ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంసిపిఐయు రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాగసుధా , డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి,జిల్లా అధ్యక్షులు ఎండి మా షూక్ మాట్లాడుతూ కార్మికులను బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోట్లను వెంటనే రద్దు చేయాలని,పాత కార్మిక చట్టాలను
పునరుద్ధరించాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ తక్షణమే ఆపాలని,స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలన్నారు.భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని,రవాణా రంగ కార్మికులకు శాపంగా మారిన జీవో నెంబర్ 21ని వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.మున్సిపల్ కార్మికుల జీవిత భద్రతకు ప్రశ్నార్ధకంగా మారే ఆప్కాస్ రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అలాగే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక కర్షక ప్రజావ్యతిరేక విధానాలను వెంటనే విడనాడాలన్నారు.ఈ కార్యక్రమంలో జన్ను అజయ్,గణిపాక బిందు మైదం పద్మ ,గజ్జి అరుణ,దొమ్మటి మల్లయ్య , లక్ష్మి ,సాంబ,కోమల,పిట్టల పద్మ తదితరులు పాల్గొన్నారు.