*చక్కెర పరిశ్రమ తెరిపించి, రైతులకు అండగా నిలవాలని డిమాండ్*
*జహీరాబాద్ నేటి ధాత్రి:*
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కోత్తూర్ శ్రీవారు లో మూతపడిన చక్కెర పరిశ్రమను ప్రభుత్వం వెంటనే తెరిపించి, చెరుకు రైతులకు అండగా నిలవాలని టీజీ ఎస్సీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ నరోత్తం డిమాండ్ చేశారు. జహీరాబాద్ లో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. ఈ సమావేశంలో పెద్ద రైతులు జి. నర్సింలు, మొగుడం పల్లి షికారి గోపాల్, గోపన్ పల్లి చెంగల్ జయపాల్ తదితరులు పాల్గొన్నారు.
