మండల కేంద్రంలో ఉన్న రెడ్ మిక్స్ ప్లాంట్ ను వెంటనే తొలగించాలి.
#దుమ్ము, శబ్దంతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులు.
#భారీ వాహనాలతో దెబ్బతింటున్న సిసి రోడ్.
#పట్టించుకోని సంబంధిత అధికారులు.
#కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్.
నల్లబెల్లి, నేటిధాత్రి
మండల కేంద్రంలో ఉన్న రెడ్ మిక్స్ ప్లాంట్ ద్వారా కస్తూర్బా విద్యార్థులు, రామాలయం గుడికి వచ్చే భక్తులకు ప్లాంట్ ద్వారా వచ్చే దుమ్ము ధూళితో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బత్తిని మహేష్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై రాస్తారోక నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అధికారం ఉన్నదని పలు శాఖలను భయభ్రాంతులకు గురిచేసి జనవాసాలలో రెడ్ మిక్స్ ప్లాంట్ కు దొంగ దారిలో అనుమతులు తీసుకొని నిర్వహణ చేస్తున్నారు. మండల కేంద్ర ప్రజలు పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకున్న పాపాన పోలేదు.

ఒకవైపు విద్యార్థులు చదువుకునే కస్తూరిబా గురుకుల పాఠశాల మరోవైపు రామాలయం గుడి ఉండడంతో విద్యార్థులు, భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా మైనింగ్ , రెవిన్యూ అధికారులు, తక్షణమే స్పందించి మండల కేంద్రంలో ఉన్న రెడ్ మిక్స్ ప్లాంట్లు వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాన రహదారిపై రాస్తరోక నిర్వహించడంతో పలు వాహనాలు స్తంభించడంతో విషయం తెలుసుకున్న పోలీసులు రాస్తారోక చేస్తున్న ప్రదేశానికి చేరుకొని విరమించే ప్రయత్నం చేయగా నిరసన చేస్తున్న వ్యక్తులు సంబంధిత అధికారులు న్యాయం చేస్తానని హామీ ఇస్తేనే నిరసన విరమిస్తామని చెప్పడంతో పోలీస్ సిబ్బంది దుగ్గొండి సీఐ సాయి రమణతో చరవనితో నిరసన చేస్తున్న మహేష్ తో మాట్లాడుతూ వెంటనే ప్లాటును తొలగించి ప్రజలకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తారని సీఐ హామీ ఇవ్వడంతో రాస్తారోకో ను విరమింప చేశారు . ఈ కార్యక్రమంలో నాయకులు కోలా లింగయ్య, మేకల మోహన్, గాజు బిక్షపతి, కన్నెబోయిన సురేష్, బత్తిని హరీష్, పరికి పవన్, త్యాగరాజు, కోడూరి సిద్దు, పోలేటి కిషోర్, కుక్క ముడి నాగరాజు, దండు సునీల్, కుక్కమూడి సుమన్, పోడేటి కిరణ్, భాస్కర్, పవన్, పల్లికొండ రవి, మాసం పెళ్లి ప్రభాకర్, నాగేల్లి సుమన్ తదితరులు పాల్గొన్నారు.
