
M.C.P.I(U) Demands BN Reddy Name for Sriramsagar Stage 2 Project
శ్రీరామసాగర్ రెండోదశ ప్రాజెక్టుకు బి.ఎన్ పేరు పెట్టాలి
ఎం సిపిఐ (యు) పార్టీ నేతల డిమాండ్
నర్సంపేట,నేటిధాత్రి:
శ్రీరామ్ సాగర్ రెండవ దశ ప్రాజెక్టుకు నల్లగొండ జిల్లా మాజీ ఎంపీ , తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు నామకరణం చేయాలని ఎంసిపిఐ (యు) రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాగ సుధా,డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి డిమాండ్ చేశారు.ఈ క్రమంలో నర్సంపేట ఆర్డిఓ ద్వారా ముఖ్యమంత్రికి మెమోరాండం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఎన్ రెడ్డి తన జీవితమంతా ప్రజల కోసమే త్యాగం చేశారని నాలుగున్నర లక్షల ఎకరాలకు నీరు అందించే ఈ ప్రాజెక్టు సాధన కోసం అలుపెరుగని పోరాటాలు నిర్వహించారని పేర్కొన్నారు.అలాంటి వారి త్యాగాన్ని గుర్తించకుండా ఆ ప్రాజెక్టుకు కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెడతామని ముఖ్యమంత్రి ప్రకటించటం సరికాదన్నారు. పీడిత ప్రజల అభ్యున్నతి కోసం త్యాగంచేసిన బిఎన్ పేరు నామకరణం చేసి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉండేలా , ముఖ్యమంత్రి పునః పరిశీలన చేసి సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేనియెడల ప్రజలను సమీకరించి ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ నాయకులు భైరబోయిన నర్సయ్య,గనిపాక బిందు,కళ్లెపెల్లి రాకేష్ పాల్గొన్నారు.