జహీరాబాద్ లో డిఎల్ పిఓ కార్యాలయం ఏర్పాటుకు మోక్షం ఎప్పుడో..???
◆:- జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహిరాబాద్ ను రెవెన్యూ డివిజన్ గా మార్చాలని అన్నీ రాజకీయ పక్షాలు,యువజన సంఘాలు,కుల సంఘాలు, ప్రజలు అఖిల పక్షంగా ఏర్పడి నిరసనదీక్షలు,నిరాహార దీక్షలు,ఆందోళనలు చేయడం జరిగింది ప్రజల ఆందోళనలకు ప్రభుత్వం తలొగ్గి ఆనాడు జహిరాబాద్ ను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయడం జరిగింది డివిజన్ గా మారిన తర్వాత ఆర్డిఓ కార్యాలయం, డిఎస్పీ కార్యాలయం మాత్రమే ఇక్కడ ఏర్పాటు చేసారు డివిజన్ ఏర్పడి సుమారు 10 సంవత్సరాలు అవుతున్న ఇంకా కొన్ని డివిజన్ స్థాయి కార్యాలయాలు రాలేదు ఇంకా జిల్లా కేంద్రం సంగారెడ్డిలో నే కొనసాగుతున్నాయి,అందులో ముఖ్యంగా డిఎల్ పీవో కలదు.ఇది డివిజన్ స్థాయి కార్యాలయం జిల్లా కేంద్రం నుండే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు కార్యాలయం అక్కడే కొనసాగుతున్నది,దీని వలన ప్రజలు తీవ్రమైన అసౌకర్యానికి గురి అవుతున్నారు ముఖ్యంగా గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదు గ్రామాల బాగోగులు చూడాల్సిన బాధ్యత కార్యదర్శుల పైన ఉన్నది ఆజమాషీ చేయాల్సిన డిఎల్ పిఓ కార్యాలయము లేకపోవడం వలన గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగితే డీఎల్ పిఓ కు విన్నవిస్తారు,ఈ కార్యాలయం జహిరాబాద్ లో లేనందున సంగారెడ్డికి వెళ్లలేక తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నారు కాబట్టి జిల్లా అధికారులు దృష్టి సారించి జహిరాబాద్ డివిజన్ కు సంబంధించిన డీఎల్ పిఓ కార్యాలయాన్ని వెంటనే జహిరాబాద్ లో ప్రారంభించి ప్రజల సమస్యలను తీర్చాలని డిమాండ్ చేయడం జరుగుతుంది

డిఎల్ పిఓ కార్యాలయం తక్షణమే ఏర్పాటు చేయాలి..ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం
గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదు గ్రామాల బాగోగులు చూడాల్సిన బాధ్యత కార్యదర్శుల పైన ఉన్నది ఆజమాషీ చేయాల్సిన డిఎల్ పిఓ కార్యాలయానికి ఉంటుంది గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగితే డీఎల్ పిఓ కు విన్నవిస్తారు,ఈ కార్యాలయం జహిరాబాద్ లో లేనందున సంగారెడ్డికి వెళ్లలేక తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నారు కాబట్టి జిల్లా అధికారులు దృష్టి సారించి జహిరాబాద్ డివిజన్ కు సంబంధించిన డీఎల్ పిఓ కార్యాలయాన్ని వెంటనే జహిరాబాద్ లో ప్రారంభించి ప్రజల సమస్యలను తీర్చాలని డిమాండ్ చేశారు
నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో లేని జహీరాబాద్ డివిజనల్ పంచాయతీ అధికారి పైనా చర్యలు తీసుకోవాలి
జహీరాబాద్ నియోజకవర్గం లో డివిజనల్ పంచాయతీ అధికారి తీరు మార్చుకోని ప్రజలకు అందుబాటులో ఉండాలని దళిత నేత తుంకుంట మెహన్ కోరారు. దశాబ్ది కాలం నుండి జహీరాబాద్ డివిజన్ పరిధిలో అందరు డివిజనల్ అధికారులు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తుంటే,, డివిజనల్ పంచాయతీ అధికారి మాత్రం హైదరాబాద్ నుండి మరియు సంగారెడ్డి నుండి రావడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రజావాణి లో కూడ పిర్యాదు చేయడం జరిగింది అని అన్నారు.ఇప్పటికైనా డివిజనల్ పంచాయతీ అధికారి తీరు మార్చుకోకపోతే జిల్లా కలెక్టర్ కు మరియు పంచాయతీ రాజ్ కమీషనర్ లకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించడం జరిగింది.
