
Delay in Double Bedroom Keys Sparks Protest
విచారణ పేరుతో కాలయాపన తగదు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ గతంలో డబుల్ బెడ్ రూమ్ ల పట్టాలు అందజేసి విచారణ పేరుతో 132 లబ్ధిదారులకు తాళాలు అందజేయకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని బి. ఆర్.ఎస్ పార్టీ నాయకులు నామరవికిరణ్ బండి మోహన్ ఆరోపించారు. ఆగస్టు 14 నాడు ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్ జరిగిన సభలో స్థానిక శాసనసభ్యులు మాణిక్ రావు విజ్ఞప్తి మేరకు పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ రెవెన్యూ అధికారులు వారం రోజులలో తాళాలు ఇస్తామని గతంలో మాట ఇవ్వడం జరిగింది. వారు చెప్పి వారం రోజుల సమయం నిన్నటితో పూర్తయింది ఇట్టి విషయమై ఈరోజు లబ్దిదారులతో కలిసి స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ వద్ద లబ్ధిదారులకు తాళాలు వెంటనే ఇవ్వాలని ఆందోళన చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ నాయకుడు నామ రవి కిరణ్ మాట్లాడుతూ లబ్ధిదారులకు వెంటనే తాళాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు, విచారణ పేరుతో కాలయాపన చేయడం సరైనది కాదు అన్నారు గతంలో ఉన్న ప్రభుత్వ హయాంలో దివ్యాంగులకు డబుల్ బెడ్ రూమ్ పట్టాలు అందజేస్తే, కనీసం వారిపై కనికరం లేకుండా తాళాలు అందించకుండా వారికి ఇబ్బందులను గురి చేయడం సరైన పద్ధతి కాదు అన్నారు ఇట్టి విషయమై డిప్యూటీ తాసిల్దార్ ఇంకొక వారం రోజులు తప్పనిసరిగా లబ్దిదారులకు తాళాలు అందజేస్తామని చెప్పారు వారం రోజుల్లో తాళాలు తీయని యెడల లబ్ధిదారులు నేరుగా వారికి గతంలో కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు స్వాధీనం చేసుకుంటారని హెచ్చరించడం జరిగింది కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షులు శివప్ప, నాయకులు గణేష్ చంద్రయ్య విద్యార్థి విభాగం నాయకుడు రాకేష్ లబ్ధిదారులు పాల్గొన్నారు.