
Mekala Prabhakar Yadav.
సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు విడుదల జాప్యం : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్
రామడుగు, నేటిధాత్రి:
సర్పంచ్ ల బిల్లులు విడుదల చేయకపోవడం పట్ల మాజీ సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ సర్పంచ్ లను మరిచిందని, వారి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించడంలో ఈరెండు ప్రభుత్వాలు విఫలమయ్యారని అన్నారు. పెండింగ్ బిల్లులు రాక,అప్పులు తీర్చలేక మాజీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే ఈప్రభుత్వం బిల్లులు వేయాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ నలబై రెండు శాతం బిసిలకు వ్యతిరేకం కాదని, బిసి రిజర్వేషన్లు లలో ముస్లింలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, జిల్లా కార్యవర్గ సభ్యులు బండ తిరుపతి రెడ్డి, సీనియర్ నాయకులు కట్ట రవీందర్, జిట్టవేని అంజిబాబు, కారుపాకల అంజిబాబు, దళిత మోర్చా మండల అధ్యక్షులు సంటీ జితేందర్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు బొమ్మకంటి భాస్కర్ చారి, అనుపురం శంకర్ గౌడ్, శేవాళ్ళ అక్షయ్, రాజేందర్ చారి, తదితరులు పాల్గొన్నారు.