Degree Student Dies of Snakebite in Peddapalli
పాము కాటుతో డిగ్రీ విద్యార్థి మృతి..
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల రూపు నారాయణపేట గ్రామానికి చెందిన గుర్రం అక్షిత వయసు 18 సంవత్సరాలు విషపురుగు పాము కాటుకు గురై మృతి చెందింది. ఎస్పై దీకొండ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం రూపు నారాయణపేట గ్రామానికి చెందిన గుర్రం అక్షిత వయసు 18 సంవత్సరాలు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న అక్షిత దీపావళి సెలవుల కోసం అని ఇంటికి వచ్చింది శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటిలో ఉండగా మంచంపై పడుకొని సెల్ ఫోన్ చూస్తుండగా ఏదో విషపు పాము | ఎడమకాలు కు కొట్టిందని అనడంతో ఇంటి పక్కన ఉన్న శ్రీధర్ 108 కి ఫోన్ చేసి చికిత్స కోసం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స చేసి అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ప్రభుత్వ అసుపత్రికి తరలించగా కరీంనగర్ ఆసుపత్రి వైద్యులు పరిశీలించి మృతి చెందిందని చెప్పారని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు
