జమ్మికుంట: నేటి ధాత్రి
తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ మరియు పీజీ కళాశాల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక బంద్ జమ్మికుంట పట్టణంలోని చాణిక్య డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ దబ్బేట విజయ-రవీందర్ మాట్లాడుతూ పేద, మధ్య తరగతి విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయలేక పోవడం వలన ప్రైవేటు కళాశాల నడపలేని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ ప్రభుత్వం సామాన్య ప్రజలకు కావలసిన విద్య దృష్టి సారించి విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలనికోరారు.
కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ దబ్బేట విజయ-రవీందర్, డైరెక్టర్లు ప్రభాకర్, శ్రీనివాస్, విజేందర్ రెడ్డి, చిరంజీవి, శివ కళాశాల ప్రిన్సిపాల్ వంశీకృష్ణ, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.