బీజేపీని ఓడిస్తేనే దేశానికి రక్షణ

ఉమ్మడి వరంగల్ జిల్లాకు బీజేపీ ద్రోహం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాసరావు

వామపక్షాల ఆద్వర్యంలో జిల్లా సదస్సు

భూపాలపల్లి నేటిధాత్రి

శుక్రవారం భూపాలపల్లి జిల్లాలోని వామపక్ష పార్టీల ఆద్వర్యంలో భూపాలపల్లి లోని కొమురయ్య భవన్లో కేంద్ర ప్రభుత్వ విధానాలు, మతోన్మాదానికి వ్యతిరేకంగా జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ జిల్లా సదస్సుకు సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, సీపీఎం, జిల్లా కార్యదర్శి బంధు సాయిలు అద్యక్షవర్గంగా వ్యవహరించగా తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఒకే దేశం, ఒకే చట్టం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ అద్యక్ష తరహా పాలనకు ప్రయత్నిస్తున్నారని, దేశాన్ని హిందూ దేశంగా మార్చి మనువాద రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. నేడు దేశంలో అవినీతి పరులంతా బీజేపీ లోనే ఉన్నారని, విపక్షాల నాయకులను ఈడీ, సీబీఐ, ఐటీ లను ప్రయోగించి లొంగదీసుకుని బీజేపీ లోకి చేర్చుకుని క్లీన్ చీట్ ఇస్తున్నారని అన్నారు. వీటి నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకే రామాలయం, సీఏఏ, హిందూత్వం పేరుతో ప్రజలను మభ్యపెటుతున్నారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దళితులు, మైనార్టీ వర్గాలపై దాడులు పెరిగాయని, దళిత వ్యతిరేక పార్టీ అయిన బీజేపీకి ఎమ్మార్పీఎస్ మద్దతు ఇవ్వడం సరికాదని అన్నారు. బీజేపీ కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తే ఉన్న రిజర్వేషన్ లను ఎత్తివేయడం ఖాయమని, అలాంటి పెత్తందారుల పార్టికి ఎమ్మార్పీఎస్ మద్దతు తగదని అన్నారు. బీజేపీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు గత పదేళ్లలో నిధుల కేటాయింపులో వివక్ష చూపిందని, విభజన హామీలైన బయ్యారం ఉక్కు, కాజీపేట రైల్వే పరిశ్రమలు నెరవేర్చ లేదని, విద్యుత్ ను కూడా ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని అన్నారు. రైతులు, కార్మికులు, మహిళలు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలకు మోసం చేసిన బీజేపీని ఈ ఎన్నికలలో ఇంటికి సాగనంపాలని కోరారు. సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యులు జె.వెంకటేష్ మాట్లాడుతూ కులాలు, మతాల మద్య చిచ్చు పెడుతున్న బీజేపీ ప్రజల మౌళిక సమస్యలు పరిష్కరించలేకనే మతోన్మాద ఎజెండా ఎత్తుకున్నదని అన్నారు. గడిచిన పదేళ్లలో బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చ లేదని, దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ ప్రశ్నించే శక్తులను నియంతృత్వంగా అణిచి వేసిందని అన్నారు. కేంద్రంలో బీజేపీ విధానాలను రాష్ట్రంలో బీఆర్ఎస్ కూడా అనుసరించుకుంటూ వచ్చిందన్నారు. ఇలాంటి బీజేపీ, బీఆర్ఎస్ లాంటి బూర్జువా పార్టీలకు వ్యతిరేకంగా వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులను కూడ గట్టి ముందుకు సాగాలని అన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయని, సామాన్యుల ఆదాయం తగ్గి ఆదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తుల ఆదాయం పెరగడానికి మోదీ విధానాలే కారణమని, మోడీని ఎన్నికలలో ఓడిస్తేనే పేదలకు భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఈ సదస్సులోఎమ్ సి పి ఐ యు నాయకుడు ఉపేందర్ రెడ్డి సీపీఐ, సీపీఎం, ఎం సీపీఐ, న్యూడెమోక్రసీ, సీపీఎం ఎంఎల్, లిబరేషన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!