Deeksha Divas: A Turning Point in Telangana Movement
స్వరాష్ట్ర సాధన లో దీక్ష దివస్ అపూర్వ ఘటం.
తెలంగాణ ఉద్యమ నేత,నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి:
తెలంగాణ స్వరాష్ట్ర సాధన లో దీక్ష దివస్ అపూర్వఘట్టమని తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.దీక్ష దివస్ కార్యక్రమం నేపద్యంలో నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద పెద్ది సుదర్శన్ రెడ్డి పూలమాలలతో అమరులకు శనివారం నివాళులర్పించారు.ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ సచ్చుడో” అని నినదించి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, ఉద్యమ నాయకుడు కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజునే దీక్ష దివస్ గా అని పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఒక అపూర్వ ఘట్టమని అన్నారు.ఈ నేపథ్యంలో యావత్ తెలంగాణ ప్రజలని,తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన దీక్ష అని తెలిపారు.తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన ఘట్టంగా ఈ దీక్ష దివస్ నిలుస్తుందని పెద్ది సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.2009 నవంబర్ 29వ తేదీన భారత రాష్ట్ర సమితి (అప్పటి టీఆర్ఎస్) అధ్యక్షులు కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి, స్వరాష్ట్ర సాధనకు బలమైన పునాదులు వేసిందన్నారు.
దీక్షకు వెళ్లే ముందు కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చుడో – కేసీఆర్ సచ్చుడో అనే తెగింపుతో చేపట్టిన ఈ దీక్ష సబ్బండ వర్గాల తెలంగాణ ప్రజలను ఏకం చేసిందన్నారు.సమగ్ర భారత దేశ రాజకీయ వ్యవస్థను కదిలించి, దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిందని పేర్కొన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి, మెప్పించి.. కులాలకు, మతాలకు అతీతంగా అందరినీ దీక్షా దివస్ కలిపిందన్ని వివరించారు.
ప్రత్యేక తెలంగాణ కళ కలగానే మిగిలిపోతుందే మో అన్న సమయంలో, అమరవీరుల నెత్తురుతో వారి త్యాగాలతో తెలంగాణ నేల తడిసి ముద్దవుతున్న సమయంలో ఎత్తిన జెండా విడవకుండా, పదవులను గడ్డి పోచల్లా విసురుతూ తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర నినాదం ఇంకా బలంగానే ఉందని అనేకసార్లు నిరూపించి త్యాగాలకు త్రొవ్వచూపిన తీరు చరిత్ర పుటల్లో పదిలమన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకటనారాయణ గౌడ్ ,రాయిడి రవీందర్ రెడ్డి,నల్ల మనోహర్ రెడ్డి,డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి,నాగిషెట్టి ప్రసాద్,మండల శ్రీనివాస్, దేవోజు సందనందం, మద్దెల సాంబయ్య గౌడ్, బగ్గి రాజు,పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
