
Yakantham Goud
వివేకవర్ధినిలో మహనీయుల వర్ధంతి
కేసముద్రం/ నేటి ధాత్రి
మండల కేంద్రంలోని శ్రీ వివేకవర్ధిని హైస్కూల్ లో శుక్రవారం స్వామి వివేకానంద, దొడ్డి కొమురయ్య వర్ధంతిని నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిర్రా యాకాంతం గౌడ్ మహనీయుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం యాకాంతం గౌడ్ మాట్లాడుతూ భారతీయ ఆధ్యాత్మికత విశిష్టతను హిందూ ధర్మ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన దార్శనికుడు స్వామి వివేకానంద అన్నారు.
తెలంగాణ స్వయం పాలన ఆకాంక్షలకు ఊపిరి పోసిన సాయుధ పోరాట కాలపు తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని అన్నారు.
మహనీయుల జీవిత చరిత్రను తెలుసుకొని వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్క విద్యార్థి నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ గడ్డమీది నవీన్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.