
చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శెట్టిపల్లి రవి (35) తన యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి, రవి తన ద్విచక్ర వాహనంపై వేములవాడ నుండి చందుర్తి కి వస్తుండగా కోరుట్ల నుండి వేములవాడకు వెళ్తున్న డీసీఎం వ్యాను ఢీకొట్టడంతో ఎడమ కాలుకు తీవ్ర గాయాలు అయ్యాయి, తీవ్రంగా గాయపడ్డ రవిని 108 వైద్య సిబ్బంది అంబులెన్స్ లో వేములవాడ ఆసుపత్రికి తరలించారు, ఈ సంఘటనపై చందుర్తి ఏఎస్ఐ బాపు దర్యాప్తు చేస్తున్నారు మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.