Daylight Murder in Zaheerabad
జహీరాబాద్‌లో వ్యక్తి హత్య!
◆:- పస్తాపూర్ శ్మశానవాటిక పరిసరాల్లో ఘటన
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టపగలు కర్రలతో దాడి చేసి ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన జహీరాబాద్‌లో చోటుచేసుకుంది. పట్టణంలోని పస్తాపూర్ శ్మశాన వాటిక పరి సరాల్లో హత్య జరగడం స్థానికంగా కలకలం రేపింది. పట్టణ సీఐ శివలింగం, ఎస్సై వినయ్‌కుమార్ తెలిపిన వివరాలు.. పస్తాపూర్ శ్మశాన వాటిక పరిసరాల్లో మంగళవారం వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని సీఐ, ఎస్సై సందర్శించి వివరాలు సేకరించారు. హత్యకు గురైన వ్యక్తి ఝరాసంగం మండలం గంగాపూర్‌కు చెందిన మహబూబ్ (30)గా గుర్తిం చారు. మృతుడు పట్టణంలోని మేస్త్రీ కాలనీలో నివాసం ఉంటూ ఆర్టీసీ డిపోలో కాంట్రాక్టు బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఘటన స్థలంలో దర్యాప్తు చేపట్టి మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అక్రమ సంబంధం నెపంతో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు పాల్పడిన వ్యక్తులు పట్టణ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు తెలిసింది.
