
England Squad Change
తుది జట్టులో డాసన్
భారత్‌తో ఈనెల 23 నుంచి జరిగే నాలుగో టెస్టు కోసం ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించారు. చేతి వేలి గాయంతో జట్టుకు దూరమైన స్పిన్నర్ షోయబ్ బషీర్ స్థానంలో…
నాలుగో టెస్టుకు ఇంగ్లండ్ టీమ్
మాంచెస్టర్: భారత్‌తో ఈనెల 23 నుంచి జరిగే నాలుగో టెస్టు కోసం ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించారు. చేతి వేలి గాయంతో జట్టుకు దూరమైన స్పిన్నర్ షోయబ్ బషీర్ స్థానంలో 35 ఏళ్ల లెఫ్టామ్ స్పిన్నర్ లియామ్ డాసన్‌కు చోటు కల్పించారు. లార్డ్స్ టెస్టులో ఆడిన ఇంగ్లండ్ జట్టులో ఇదొక్కటే మార్పు కావడం గమనార్హం. దీంతో డాసన్ ఎనిమిదేళ్ల తర్వాత టెస్టు ఆడబోతున్నాడు. కెరీర్లో తను మూడు టెస్టులు ఆడగా 2017లో చివరిసారి దక్షిణాఫ్రికాపై బరిలోకి దిగాడు.
తుది జట్టు: స్టోక్స్ (కెప్టెన్), క్రాలే, డకెట్, రూట్, పోప్, బ్రూక్, స్మిత్, వోక్స్, డాసన్, కార్స్, ఆర్చర్.