Datta Giri Maharaj Aradhana Celebrated at Bardipur Ashram
బర్దీపూర్ ఆశ్రమంలో వైభవంగా దత్తగిరి మహారాజ్ ఆరాధన మహోత్సవాలు
◆-: ఆది శంకరాచార్యుల విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు
◆-: డా౹౹ సిద్ధం.ఉజ్వల్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ ఝరాసంగం మండలంలోని సుప్రసిద్ధ బర్దీపూర్ ఆశ్రమం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది.శ్రీ దత్తగిరి మహారాజ్ వార్షిక అమర తిథిని పురస్కరించుకుని ఆశ్రమ ప్రాంగణంలో మహా మృత్యుంజయ మంత్ర శత సహస్ర జపయజ్ఞం, దత్తహోమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన శ్రీశ్రీశ్రీ జగద్గురు ఆది శంకరాచార్యుల విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా. సిద్ధం ఉజ్వల్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.బర్దిపూర్ ఆశ్రమ అప్ప వారిని శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా ఉజ్వల్‌రెడ్డి మాట్లాడుతూ దత్తగిరి మహారాజ్ వంటి మహనీయుల ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని,లోక కళ్యాణం కోసం నిర్వహించిన ఈ జపయజ్ఞం అందరికీ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటునన్నారు. ఈ కార్యక్రమంలో పాటు సిడిసి చైర్మన్ ముబీన్,జహీరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి,సీనియర్ నాయకులు శ్రీకాంత్‌రెడ్డి,నర్సింహారెడ్డి,అశ్విన్ పాటిల్,జగదీశ్వర్ రెడ్డి మరియు పెద్ద సంఖ్యలో భక్తులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.
