
Data Entry Operators Await Pending Payment
డేటా ఎంట్రీ సరే.. పారితోషికమేది..?
◆:- గతేడాది నవంబర్లో సమగ్ర కుటుంబ సర్వే
◆:- ఏడాది దాటినా తప్పని ఎదురుచూపులు
◆:- ప్రైవేట్, ప్రభుత్వ ఆపరేటర్లతో ఆన్లైన్లో వివరాల నమోదు
◆:- ఇప్పటికీ అందని పారితోషికం
◆:-ఆందోళనలో డేటాఎంట్రీ ఆపరేటర్లు
ఆపరేటర్లకు ఇప్పటికీ పారితోషికం అందలేదు. గతేడాది నవంబర్లో పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ అధ్యాపకులు, వార్డు అధికారులు, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లను ఎన్యూమరేటర్లగా ఎంపిక చేసి ప్రజల వద్ద వివరాలు సేకరించారు. వాటిని ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా వివరాలు నమోదు చేసేందుకు గాను ప్రభుత్వ, ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్లను నియమించారు. వీరికి ఎంట్రీ చేసిన దరఖాస్తు వారీగా డబ్బు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటికీ అందలేదు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్ధిక,విద్య, రాజకీయ, కుల సమగ్ర వివరాలను తెలుసుకునేం దుకు గాను ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు గాను గతేడాది నవంబర్లో పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ అధ్యాపకులు, వార్డు అధికారులు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు మొదలగు ఉద్యోగులను ఎన్యూమరేటర్లగా ఎంపిక చేసి సర్వే నిర్వహించడం జరిగింది. సర్వే చేసిన వివరాలను ఆన్లైన్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక సాఫ్ట్వేర్ నందు నమోదు చేసేందుకు గాను ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్లను నియమించారు. వీరికి ఎంట్రీ చేసిన దరఖాస్తు వారీగా పారి తోషికం ఇస్తామని వారి సేవలని తీసుకుని నిర్దేశించిన లక్ష్యం లోపల దరఖాస్తులన్నింటిని ఆన్లైన్ లో నమోదు చేశారు.
ఏడాది దాటినా తప్పని ఎదురుచూపులు..
సర్వే అనంతరం డేటాను ప్రత్యేక అప్లికేషన్లో నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను ప్రభు త్వంలోని పలు శాఖలలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్లు జూనియర్ అసిస్టెంట్లతో డేటా ఎంట్రీ
కార్యక్రమాన్ని నిర్వహించాలని ముందుగా అనుకున్నారు. కానీ, దరఖాస్తులు ఎక్కువగా ఉండడం, ప్రభుత్వం నుంచి త్వరితగతిన పూర్తి చేయాలని గడువు నిర్దేశించడంతో తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఏర్పాటు చేసి నిర్దేశించిన గడువులో కూడా పూర్తి చేయాలని నిర్ణయిం చారు. ఇందులో భాగంగా ఆసక్తి గల డేటా ఎంట్రీ ఆపరేట ర్లకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఆడిటోరియంలో డేటాఎంట్రీ నమోదు పై ఒక రోజు శిక్షణ ఇప్పించిన అనంతరం పనులను అప్పగించారు. జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు డాటా ఎంట్రీ ఆపరేటర్లు సుమారు 600 మంది తమ విధులను నిర్వర్తించి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని సత్వరం పూర్తిచేసేందుకు అహర్నిశలు శ్రమించారు. ప్రభుత్వం నుండి పారితోషికం వస్తుందని ఆశతో పనులు చేసిన వీళ్ళందరికీ నిరాశనే ఎదురయింది. తొందరలో పూర్తిచేస్తే త్వరగా వస్తాయని ఆశపడిన డేటా ఎంట్రీ ఆపరే టర్లకు ఏడాదిగా ఎదురుచూపులు తప్పలేదు. జిల్లాలో సుమారు రూ.60 లక్షల మేర ఆపరేటర్లకు ప్రభుత్వం నుంచి నిధులు అందాల్సి ఉంది,
రెండు నెలల్లో ఇస్తామన్నారు..
బీటెక్ పూర్తి చేసిన నేను 470 సమగ్ర కుటుంబ సర్వే పారాలను నమోదు చేశాను. రెండు నెలల్లో డబ్బు వస్తాయని అన్నారు. ఏడాది అవుతున్నా ఇంకా ఇవ్వలేదు. డబ్బు గురించి మండల కార్యాల యంలో తెలుసుకుంటే ఇంకా ప్రభుత్వం నుండి నిధులు రాలేదని చెప్తున్నారు.
నెలల నుంచి ఎదురుచూస్తున్నాం
మేము డేటా ఎంట్రీ చేసి 9 నెలలు అవుతున్నా డబ్బు పడలే దు. నేను 780దరఖాస్తులు ఆన్ లైన్ చేశాను. మా ఎంపీడీవో నైట్ అంతా ఆఫీసులో ఉంచి వర్క్ చేయించుకున్నారు. ఇప్పుడేమో డబ్బు అడిగితే జిల్లా కార్యాలయంలో అడగండి అంటున్నారు.
దసరా వరకూ అయినా ఇప్పించాలి
డేటా ఎంట్రీ చేసి తొమ్మిది నెలలు గడిచింది. ఈ దసరా సందర్భంగా ఆయి నా పారితోషికం అందించాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఉన్నతాధికారులు ప్రభుత్వం మాపై కనికరం చూపాలి.
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం
సమగ్ర కుటుంబ సర్వే చేసిన డేటా ఎంట్రీ ఆపరేటర్లకు సంబంధించి పారితోషికం అందజేయాలని ప్రభు త్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయగానే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు అందజేస్తాం.