నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)
కమలాపూర్ మండల సామిల్ మరియు టింబర్ డిపో అసోసియేషన్ అధ్యక్షులుగా ఇటీవల జరిగిన సమావేశములో సభ్యులు దాసి శంకరయ్య ను ఎన్నుకున్నారు.సామిల్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన శంకరయ్య ను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాతో సత్కరించి సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో నాయకులు తవుటం రవీందర్, బాలసాని రమేష్ గౌడ్, దేసిన ఐలయ్య గౌడ్, నాంపల్లి ప్రభాకర్, పోడేటి బిక్షపతి, శివకృష్ణ, పాక చంద్రమౌళి, గట్టు శ్రీధర్,మాజీ ఎంపీటీసీ అంకుసు, మెండు నరసయ్య, ఆడపు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.