ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని స్పెషల్ ఆపిసర్ పాలన
వేములవాడ రూరల్ నేటిధాత్రి
వేములవాడ రూరల్ మండలం లోని ఎదురుగట్ల గ్రామంలో
వీధి దీపాలు లేక నిత్యం ప్రమాదాలు జరుగుతున్న చోద్యం చూస్తున్న గ్రామ పంచాయతీ అధికారులు గ్రామంలో వెలుగాని దీపాలు రోడ్లు వెంట కమ్ముకున్న చీకట్లు నిత్యం ప్రమాదాలు అవుతున్నా పట్టించుకున్న పాపాన పోలేరు
వివరాల్లోకి వెళ్ళితే వేములవాడ పట్టణానికి అతి సమీపంలో ఉన్న ఎదురుగట్ల గ్రామం నుండి పలు గ్రామాలకు నిత్యం వందలాది వాహనాలు వస్తూ ఉంటాయి పోతుంటాయి ఇది కామన్ ఇక రాత్రి అయితే రోడ్ల వెంబడి కమ్ముకున్న చీకట్లు రోడ్డు వెంట విధి దీపాలు లేక ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి
కాలి పోయిన దీపాల స్థానంలో అధికారులు కొత్తవి ఏర్పాటు చేయడంలో నెలలు గడుస్తున్నా ఏర్పాటు చేయడం లేదు ఫలితంగా ప్రమాదాల తీవ్రత పెరుగుతూనే ఉన్నాయి అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రామానికి చెందిన మహేష్ , తీవ్రంగా గాయాల పాలు అయ్యారు
తప్పు ఎవరిది
రోడ్ల ప్రయాణిస్తున్న వాహన దారులదా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులదా
ఏది ఏమైనా అమాయక ప్రజలు అవస్థల పాలు అవుతున్నారు ఇకనైనా అధికారులు చొరవ చేసుకొని రహదారుల వెంట విధి లైట్ లు పెట్టియలని ప్రజలు వాహన దారులు కోరుతున్నారు