Dangerous Curves Need Warning Boards
ప్రమాదకరమవుతున్న మూలమలుపులు
ఉన్న కమిపించని సూచిక బోర్డులు
అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి
పరకాల,నేటిధాత్రి
https://youtu.be/MSw6pq0a_0M?si=VTOJxzmb7N1uhae8
మూల మలుపులు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి.మండలంలోని డిపో సమీపంనుండి నాగారం గ్రామం చేరే వరకు వెళ్లే రోడ్డులో అడుగడుగునా మృత్యు మలుపులుగా దర్శనమిస్తున్నాయి.2 కిలోమీటర్ల పొడువులో 3చోట్ల మూల మలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి వేళ ఈ మార్గంలో వెళ్లి లంటే ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు.

ఈ రోడ్డుగుండా మొగుళ్లపల్లి,చిట్యాల మండల కేంద్రానికి చాలా గ్రామాల ప్రజలు అనేక మంది ఆటోల్లో, ద్విచక్ర వాహ నాలపై వెళ్తుంటారు.గతంలో కూడా మూలమలుపుల వద్ద అనేక మార్లు వాహనాల ప్రమాధాలు జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.అలాగే ప్రైవేటు పాఠశాలల బస్సులు సైతం ఈ మార్గంలో వెళ్తుంటాయి.వాహ నాలు నడిపే వారు మూల మలుపులతో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని పేర్కొంటున్నా రు.మూల మలుపులు ఉన్న చోట రేడియంతో తెయారు చేసిన సూచికల బోర్డును ఏర్పాటు చేయా అని వాహనదారులు కోరుతున్నారు.మలుపు వద్ద ఏపుగా పెరిగిన మొక్కలు చెట్లకొమ్మలవల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనపడకపోవడం తో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు.మూల ములవులు ఉన్నచోట అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి వాహనదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉందని అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతు న్నారు.

ఆగితే తప్ప కనిపించని సూచిక బోర్డులు.. అధికారులు స్పందించాలి
పసుల వినయ్ అంబేద్కర్ బిఎస్పీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు
ఒకటి రెండు చోట్ల ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికి అవి చెట్లకొమ్మలు,చెట్ల తీగలు అడ్డుగా వాలి ఆగితే తప్ప వాహనాల మీద వెళ్ళేవారికి కనిపించడం లేదని ప్రజల మరియు వాహనదారుల ప్రణాలమీద అధికారులకు ఎందుకుయింత నిర్లక్ష్యంగా ఉంటున్నారో అర్ధం కావడంలేదు.రాత్రి కాలసమయంలో ప్రయాణం నరకంగా మారుతుంది.ముందున్న రోజుల్లో ఎలాంటి ప్రమాదలకు గురికాకుండా వాహనదారులకు కనిపించే విధంగా సూచిక బోర్డు లు ఏర్పాటు చేయాలనీ అధికారులను కోరుతున్నాం.
