Dangerous Pothole on Kavelly-Kohir Road Sealed
కవేలి టు కోహిర్ రోడ్డుపై ప్రమాదకర గుంతను జెసిబి సహాయంతో మూసివేత
జహీరాబాద్ నేటి ధాత్రి,:
జహీరాబాద్ నియోజకవర్గంలో
కోహిర్ మండల పరిధిలోని కవేలి టు కోహిర్ రోడ్డులో, కవేలి బ్యాంకును దాటి కొద్దిదూరంలో ఏర్పడిన ప్రమాదకర గుంత వల్ల గత కొంతకాలంగా రోడ్డుప్రమాదాలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో, స్థానికుల విజ్ఞప్తి మేరకు మరియు రాహదారుల భద్రత దృష్టిలో ఉంచుకుని,కోహీర్ ఎస్ఐ నరేష్ స్పందించి వెంటనే జెసిబి సహాయంతో ఆ గుంతను మూసివేసి ప్రమాదాలను నివారించారు.అనంతరం కవేలి టు కోహిర్ తిరిగి వాహనదారులు స్థానిక ఎస్ఐ నరేష్ కు సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
