
ఇరువైపులా తుమ్మలతో రోడ్డు
కాసిపేట రోడ్డుపై పెరిగిన తుమ్మ చెట్లతో ప్రమాద భయం – తక్షణ చర్యలు కోరుతూ టీబీజీకేఎస్ విజ్ఞప్తి
మందమర్రి నేటి ధాత్రి
మందమర్రి ఏరియాలోని కాసిపేట-1 కాసిపేట 2 గనులకు వెళ్లే మార్గంలో ఇరు వైపులా తుమ్మ చెట్లు విస్తృతంగా పెరిగినట్టు టీబీజీకేఎస్ యూనియన్ నాయకులు గమనించారు. ఈ రోడ్డులో ప్రతినిత్యం వందలాది సింగరేణి కార్మికులు ప్రయాణిస్తుండగా, రోడ్డుపై అడ్డంగా కనిపించకుండా ఉండే పశువులు – ఆవులు, గేదెలు, పందుల వలన ప్రమాదాల అవకాశం ఉందని వారు తెలిపారు.
ఇప్పటికే కొన్ని ప్రమాదాలు జరగగా, మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. దీనికి తోడు, రోడ్డు ఇరువైపులా వీధి దీపాలు లేకపోవడంతో రాత్రివేళ మరింత ప్రమాదకరంగా మారిందని అన్నారు.
ఈ నేపథ్యంలో, జి.ఎం గారిని కలిసిన టీబీజీకేఎస్ నాయకులు తక్షణ చర్యలు తీసుకుని చెట్లను తొలగించి, వీధి దీపాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:
టీబీజీకేఎస్ కాసిపేట 1 కాసిపేట 2 యూనియన్ నాయకులు, టీబీజీకేఎస్ సెంట్రల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ బెల్లం అశోక్,
కాసిపేట-1 గని ఫిట్ కార్యదర్శి శంకర్,
ఏరియా నాయకులు సొలంగి శ్రీనివాస్,
మాజీ ఫిట్ కార్యదర్శులు బనోత్ తిరుపతి, బిక్షపతి, అఫ్జల్ ఉద్దీన్,
దోమ్మట్టి రమేష్, తోకల రమేష్, బండారి రమేష్,
మైకల్, క్రిష్ణ,
యువ నాయకులు సతీష్ వర్మ, సతీష్ యాదవ్, అందే శ్రీకాంత్, సంగి రవి, రామునూరి రాజేష్, రంజిత్, రవికాంత్, ఎండీ అజీమ్, మహీందర్ తదితరులు.