డేంజర్ మూల మలుపులు
• ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా ?
• కుప్పా నగర్ వద్ద పలు ప్రమాదాలు
• ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు, మూగజీవాల మృతి
• సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్ కోసం ప్రయాణికుల డిమాండ్
జహీరాబాద్. నేటి ధాత్రి:
ఝరాసంగం మండలం కుప్పా నగర్ సమీపంలో ఏడు ప్రమాదకర రోడ్డు మలుపులు ఉన్నాయి. ఈ రోడ్డు మార్గం మీదుగా ఝ రాసంగం, రాయికోడ్, మునిపల్లి, వట్టిపల్లి, రే గోడు, అల్లాదుర్గ్ మండలాల ప్రజలు ప్రయాణిస్తుం టారు. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపో కలు సాగుతుంటాయి. మాచ్నూర్ నుంచి ఝరాసంగం వరకు రోడ్డు భవనాల శాఖ రోడ్లపై ఎలాంటి సూచిక బోర్డు గాని, స్పీడ్ బ్రేకర్లు గాని ఏర్పాటు చేయకపోవ డంతో పలుమార్లు ప్రమాదాలు చోటుచేసుకుంటు న్నాయి. కుప్పానగర్ శివాజీ విగ్రహం సమీపాన ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు ప్రమాదాల్లో మృతి చెందారు. పలు మూగ జీవాలు సైతం మృతి చెందాయి.

కుప్పా నగర్ శివారులోని జట్టప్ప బావి మూల, మల్లన్న గుట్ట క్రాస్ రోడ్, శివాజీ విగ్రహం, ప్రభుత్వ పాఠశాల, హైమద్ దర్గా, గొల్ల రవి పొలం వద్ద ప్రమాదకర మలుపులు ఉన్నాయి. ప్రమాదకరమైన మలుపుల వద్ద పలుచోట్ల స్పీడ్ బ్రేకర్ల, సూచిక బోర్డుల కోసం రోడ్ల భవనాల శాఖ అధికారులకు విన్నవించిన పట్టించుకో వడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. జహీ రాబాద్ నుంచి కుప్పా నగర్ మీదుగా రోడ్డు మార్గంలో ఎల్లమ్మ దేవాలయం నుంచి పోచమ్మ వాగు వరకు వాహనాలు అతివేగంగా రావడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కుప్పా నగర్ నుంచి మల్లన్న గట్టు, బర్దిపూర్, ఎల్గోయి వెళ్లే రహదారి మలుపులు ప్రమాదక రంగా ఉన్నాయి. అదేవిధంగా ఝరాసంగం గోలి గట్టు కింద రోడ్డు వంతెన వద్ద ఇరువైపులా రోడ్డు కుంగిపోయి ప్రమాదాలు చోటు జరుగుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో కుప్పా నగర్ గ్రామస్తులు రోడ్డుపై బైఠారించి రాస్తారోక చేస్తామన్నారు.