నర్సంపేట,నేటిధాత్రి :
ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్
రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామానికి దండు చిరంజీవి ముదిరాజ్ ను మెపా రాష్ట్ర కార్యదర్శి గా ఎన్నికైనట్లు రాష్ట్ర అద్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర అద్యక్షులు దేవేందర్,ప్రధాన కార్యదర్శి బోట్ల పల్లి సంజీవన్ కుమార్,గౌరవ అధ్యక్షులు డాక్టర్ జగన్ మోహన్ ముదిరాజ్ ముదిరాజ్ లు నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ జాతి అభివృద్ది ఐక్యత కోసం అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానని ,రిజర్వేషన్ సాధన కోసం కలిసి కట్టుగా ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ ఎన్నికపట్ల తనపై మరింత బారం పెరిగిందని చెప్పారు.