వనపర్తి నేటిధాత్రి :
నాగర్కుర్నూల్
జిల్లా సింగోటం జాతరలో వనపర్తి జిల్లా బాలాభవన్ విద్యార్థులను సింగోటం జాతరలో వనపర్తి బాల భవన్ కన్వీనర్ డీఈ వో అనుమతి లేకుండా చిన్నారులచే డాన్స్ ప్రోగ్రాం నిర్వహించారని ప్రజలు తెలిపారు. బాల భవన్ కు జిల్లా కలెక్టర్ చైర్మన్ కన్వీనర్ గా డీఈవో ఉంటారు. ఈ విషయమై డీఈ ఓ సెల్ 7995087601నేటి దాత్రి దినపత్రిక విలేకరి వివరణ కోరగా చిన్నారులచే డాన్స్ ప్రోగ్రాం ఆదివారం నిర్వహించినందుకు మీరు అనుమతి ఇచ్చారా అని అడగగా ఈ విషయం నాకు తెలియదు నాకు సంబంధం లేదు అని చెప్పారు . బాల భవన్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి లావణ్య ను వివరణ కోరగా బాల భవన్ చిన్నారులను తీసుకువెళ్లిందని నాకు తెలియదని డీఈవో గారిని అడగాలని చెప్పారు. ప్రైవేట్ స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులను విహారయాత్రలకు ఇతర ప్రోగ్రాంలో తీసుకువెళ్లాలన్నా డి ఇ ఓ అనుమతి తీసుకొని వెళ్లాలని నిబంధనలు ఉన్నాయి వనపర్తి డీఈవో మాత్రం నాకు సంబంధం లేదు నాకు తెలియదని చెప్పడం విడ్డూరంగా ఉందని ప్రజలు అంటున్నారు అనుకోని సంఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు ప్రజలంటున్నారు ప్రైవేట్ డాన్స్ ఇనిస్ట్యూట్ పేరుతో చిన్నారులనుసిoగోటం తీసుకువెళ్లి ప్రోగ్రాం నిర్వహించడంపై ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే మెగా రెడ్డి వనపర్తి జిల్లాలో ప్రైవేటు స్కూల్స్ బాలాభవన్ లు కస్తూర్బా పాఠశాలలు ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తే వీరి బండారం బయట పడుతుందని ప్రజలంటున్నారు. ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి బాల భవన్ ప్రభుత్వ పాఠశాలలను ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ అధికారులకు జీతాలు చెల్లించి విద్యా శాఖను నడిపిస్తున్నారు. ఈ విషయమై విద్యార్థి సంఘాలు స్పందించి విద్యాశాఖ అధికారుల తీరును అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలను బాల భవన్ లను సందర్శిస్తే పలు విషయాలు వెలుగులోకి వస్తాయని నిజాయితీపరులు విద్యావేత్తలు అంటున్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయులకు లక్షల రూపాయల జీతాలు చెల్లించి విద్యార్థులకు వసతులు విద్యా బోధన కు చెల్లిస్తున్నది ఈవిషయంపై తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎం ఏ ఖాదర్ పాషా వనపర్తి జిల్లాలోని పాఠశాలల తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చీఫ్ సెక్రటరీ ఎమ్మెల్సీ కోదండరామ్ కు ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి ఎమ్మెల్యే మెగా రెడ్డికి ఫిర్యాదులు చేస్తామని ఆయన పేర్కొన్నారు. సింగోటం లో వనపర్తి జిల్లా బాల భవన్ చిన్నారులు చే చే ప్రభుత్వ డీఈ ఓ అనుమతి లేకుండా ప్రోగ్రాం నిర్వహించడంపై అనుకోని సంఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఖాదర్ ఆవేదనవ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ స్పందించి వనపర్తి జిల్లా బాల భవన్ కన్వీనర్ డి ఈ ఓ పై చర్యలు తీసుకొని సంబంధిత ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ పేరుతో ప్రోగ్రాం తీసుకువెళ్లిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు
డి ఇ ఓ అనుమతి లేకుండా సింగోటం జాతరలో ప్రభుత్వ బాల భవన్ చిన్నారులచే డాన్స్ ప్రోగ్రాం
