https://epaper.netidhatri.com/
`పదవుల పందేరంలో దోబూచులాటలు!
`ఎక్కడ పచ్చగా వుంటే అక్కడే రాజకీయాలు.
https://epaper.netidhatri.com/
`సీమాంధ్రుల అడుగుజాడలు?
`పిజేఆర్ ఆశీస్సులతో రాజకీయం మొదలు?
`ఆంధ్రా నేతలకు గొడుగులు?
`వైఎస్ వెంట అడుగులు?
`రోశయ్యతో సఖ్యతలు?
https://epaper.netidhatri.com/
`కిరణ్ కుమార్ రెడ్డి ఏది చెబితే అదే అమలు?
`కొంత కాలం జగన్ తో బాసటలు
`జగన్ సిఎం చేయాలని సంతకాలు!
`జగన్ కు సిఎం అయ్యే చాన్స్ లేదని తెలిసి జారుకున్న క్షణాలు.
`పార్టీ జగన్ కు కాదనగానే జగన్ కు దూరంగా రాజకీయాలు.
`మంత్రి పదవుల కోసం కాకాలు?
`తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయాలు?
`సీమాంధ్రుల ప్రసన్నం కోసమే పడిగాపులు?
`తెలంగాణ కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని ఉత్తరాలు?
`హైదరాబాద్ తో తెలంగాణకు సంబంధం లేదని అప్పట్లో ప్రకటనలు.
`ఒక దశలో కేసిఆర్ ను హైదరాబాద్ లో అడుగుపెట్టనివ్వమని బీరాలు!
`ఇవీ దానం గత రాజకీయ ఆనవాలు!
హైదరబాద్,నేటిధాత్రి:
ఏనాడు జై తెలంగాణ అన్నది లేదు. ఇప్పటికీ మనసు నుంచి ఆ మాట వచ్చినట్లు వుండదు. కేవలం పదవి కోసం మాత్రమే ఆయన ఆ మాట అప్పుడప్పుడు మొక్కుబడిగా అంటుంటాడు. అది కూడా బిఆర్‌ఎస్‌లో వుండడం మూలాన తప్ప, కాంగ్రెస్‌లో వుంటే ఆ మాట ఇప్పటి వరకు ఉచ్చరించేవారు కాదేమో! ఎందుకంటే ఆయన గత రాజకీయ చరిత్ర మొత్తం తెలంగాణకు వ్యతిరేకమే? అసలు తెలంగాణకు హైదరాబాద్‌కు సంబంధం లేదని మాట్లాడేంత గొప్ప రాజకీయ చరిత్ర ఆయనది. అందుకే ఆయన తన రాజకీయ జీవితంలో ఏనాడు జై తెలంగాణ అనడానికి ఇష్టపడలేదు. తెలంగాణ ఉద్యమానికి సహకరించలేదు. పరోక్షంగా సహకరించాడని చెప్పడానికి ఒక్క మచ్చు తునక కూడా లేదు. ఆయనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఆయనకు ఉమ్మడి రాష్ట్ర పాలనలో తెలంగా ణ ఎంత గోసపడిరదో తెలియదు. తెలంగాణ ప్రజలు ఎంతవిలవిలలాడిపోయారో తెలియదు. తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటం ఎందుకు జరిగిందో తెలియదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో విలీనం కాకముందే హైదరాబాద్ రాష్ట్రమన్న సంగతి అసలే తెలియదు. తెలిస్తే తెలంగాణ గురించి ఏనాడు చులకనగా మాట్లాడి వుండేవారు కాదు? తెలిసినా తెలంగాణ ఉద్యమాన్ని చులకన చేశాడంటే తెలంగాణ అంటే కోపమన్నది నిజమే… పిజేఆర్ అనుచరుడిగా వున్నా, ఆయన ద్వారా రాజకీయాల్లోకి వచ్చినా, ఆయన ఆశీస్సులతో ఎదిగినా తెలంగాణ విషయంలో గురువుకు సహకరించింది లేదు. గురువుకు పంగనామాలు పెట్టి, సమైక్యవాదులతో చేతులు కలిపిన నాయకుడు దానం నాగేందర్. పిజేఆర్ తెలంగాణ కోసం పరితపించిన విధానం చూసి, కూడా దానం నాగేందర్ అసలు తెలంగాణ చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. పిజేఆర్ బతికున్నంత కాలం పోతిరెడ్డిపాడుపై ఎంతో పోరాటం చేశాడు. తెలంగాణకు రావాల్సిన నీళ్లను రాయలసీమకు, మాద్రాసుకు తరలించడాన్ని ఆయన అడుగడుగునా అడ్డుకున్నాడు. సీలెరుపై పిజేఆర్ బతికున్నంత కాలం నిరంతర పోరాటం చేశాడు. కాని తెలంగాణ ప్రాంత హక్కులు, అవసరాలు దానం నాగేందర్‌కు పట్టలేదు. ఆయన దృష్టిలో తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగం కాదు. తెలంగాణకు హైదరాబాద్‌కు సంబందం లేదన్నంత వాదన ఆయన వినిపించేవారు. హైదరాబాద్ మీద పడి తెలంగాణ బతుకుతుందన్నంతగా ఆయన భావించేవారు. అందుకే జై తెలంగాణ అంటే వినిపించుకునేవారు కాదు. తొలి తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగిందన్నదానిపై అవగాహన లేదు. మలితరం ఉద్యమం ఎందుకు జరిగిందన్నదాన్ని తెలుసుకునే ప్రతయ్నం ఏనాడు చేయలేదు. ఒక దశలో తెలంగాణకు హైదరాబాద్‌కు ఏం సంబంధం? అని బహిరంగంగా ప్రశ్నించిన నాయకుడు దానం నాగేందర్. హైదారబాద్ మాది. మేం లోకల్..మేం చెప్పిందే నడవాలి అనేవారు. తెలంగాణ ప్రజలు హైదరాబాద్‌కు బతకొచ్చినట్లే లెక్క..అన్నంతగా దానం మాటలు వుండేవి. ముఖ్యమంత్రి కేసిఆర్ ఉద్యమ నాయకుడిగా 14ఎఫ్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం ఉదృతమై, చివరకు ఆమరణ నిరసన దాకా వెళ్లింది. తెలంగాణ విజయ యాత్రనో…కేసిఆర్ శవయాత్రనో అని పిలుపిచ్చి మరీ కేసిఆర్ ఆమరణ దీక్ష చేపట్టారు. ఆ సయమంలో కేంద్రం దిగి వచ్చి ఆనాటి కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ ప్రకటన చేశారు. అయినా దానం నాగేందర్ తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించలేదు. తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంద్ర ఎమ్మెల్యేలు రాజీనా మా చేశారు. అదేవిధంగా తెలంగాణకు అనుకూలంగా తెలంగాణ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సి వస్తే, దానం చేయలేదు. తెలంగాణ ప్రకటనపై కేంద్రం వెనక్కి తగ్గి, శ్రీ కృష్ణ కమిటి వేస్తే దానికి తెలంగాణ అవసరం లేదని ఉత్తరం రాశాడు…హైదరాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రం చేయాలని కోరిన ఏకైక వ్యక్తి దానం నాగేందర్. ఏనాడు తెలంగాణ వైపు నిలబడలేదు. మొత్తంగా వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి దానం. అయితే 2004 ఎన్నికల మందు రాష్ట్రంలో తెలంగాణ వచ్చే పరిస్దితి కనిపించకపోవడంతో వైఎస్ వేసిన తెలంగాణ ఎత్తుకు మాత్రం మద్దతు పలికాడు. అసలైన తెలంగాణ ఉద్యమానికి మాత్రం ద్రోహం చేశాడు. ఇదీ దానం రాజకీయం. తెలంగాణ వస్తే ఎక్కడ తన రాజకీయం అయోమయంలో పడుతుందో అని ఆలోచించాడే? గాని తెలంగాణ వస్తే నాలుగు కోట్ల ప్రజల జీవితాలు బాగు పడతాయని ఆలోచించలేదు. తెలంగాణ ఆత్మగౌరప పతాక ఎగురుతుందని అనుకోలేదు. తెలంగాణ కోసం నా వంతు కృషి చేస్తానని కలలో కూడా చెప్పలేదు. ఎంత సేపు తన పదవుల పందేరం తప్ప, తెలంగాన వస్తే తెలంగాణ ఆత్మగౌరవం నిలబడుతుందని ఆశించలేదు. తెలంగాణ రాజకీయాల్లో తనకు సమున్నతమైన న్యాయం జరగదనే ఆలోచించాడు. తన రాజకీయం అక్కడే ఆగిపోతుందని భయపడ్డాడు.
ఎక్కడ పచ్చగా వుంటే అక్కడ రాజకీయాలు దానం నాగేందర్‌కు వెన్నతోపెట్టిన విద్య.
తెలంగాణలో వైఎస్ ప్రభావం లేనంత కాలం పిజేఆర్ చెంతన ఎదిగాడు. ఆ సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో చెన్నారెడ్డి లాంటి వారి నాయకత్వం బలంగా వుండేది. ఆ తర్వాత కోట్ల విజయభాస్కరరెడ్డి లాంటి వారి నాయకత్వం సాగింది. ఆ సమయంలో వైఎస్ తెలంగాణ రాజకీయాల్లో పెద్దగా వేలు పెట్టలేదు. ఎప్పుడైతే బలమైన నాయకులు పార్టీకి దూరమయ్యారో అప్పటినుంచి తన రాజకీయ పలుకుబడి పెంచుకుంటున్న వైఎస్ పంచన దానం చేరాడు. ఒకరకంగా చెప్పాలంటే సీమాంధ్రుల అడుగు జాడల్లో నడిచాడు. పుట్టి పెరిగింది తెలంగాణలో అయినా, ప్రజలు ఎన్నుకునేది తెలంగాణ ప్రజలే అయినా, ఆయన మాత్రం సీమాంధ్ర నాయకులకు ఊడిగం చేయడానికే ఇష్టపడ్డాడన్నది జగమెరిగిన సత్యమే. 2004 ఎన్నికల్లో టిక్కెట్ కాంగ్రెస్ ఇవ్వలేదు. వెంటనే సైకిలెక్కేశాడు. కాంగ్రెస్ కాదంటే పార్టీ కోసం త్యాగం చేయలేదు. తన రాజకీయం కోసమే ఆలోచించాడు. సానుభూతితో చంద్రబాబు సైకిల్ ఎక్కించుకుంటే, గెలిచిన వెంటనే దిగిపోయి, తెలుగుదేశానికి దోకా చేశాడు. ఆపై ప్రజలను కూడా మోసం చేద్దామనుకున్నాడు. కాని కుదరలేదు. ఓడిస్తే వైఎస్ ఊడిగం చేశాడు? 2009లో గెలిచి మంత్రి అయ్యాడు. అనుకోకుండా వైఎస్ మరణంతో మళ్లీ దానం రాజకీయం అయోమయంలో పడే పరిస్ధితి వచ్చింది. కాని రోశయ్య తన మంత్రి వర్గంలోకి తీసుకున్నాడు. ఓ వైపు వైఎస్ పార్ధివ దేహం అక్కడ వుండగానే జగన్‌ను సిఎం చేయాలన్న రాజకీయం దానం మొదలుపెట్టాడు. సంతకాల కార్యక్రమం చేపట్టాడు. కాని కుదరలేదు. జగన్ సిఎం అయ్యే పరిస్ధితి కనిపించలేదు. దాంతో అక్కడి నుంచి జారుకున్నాడు. రోశయ్యకు అండగా నిలిచి, జగన్‌కు జెల్ల కొట్టాడు. అనంతర కాలంలో రోశయ్య తన పదవికి రాజీనామా చేయడంతో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ సమయంలో దానం నాగేందర్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. కిరణ్‌కుమార్‌రెడ్డిని హైదరాబాద్‌లో పెద్ద ఎత్తునర్యాలీ నిర్వహించాడు. మళ్లీ మంత్రి పదవి పొందాడు. తెలంగాణ ఉద్యమాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి అణచివేయడం మొదలుపెట్టాడు. కేవలం తన రాజకీయం కోసం మాత్రమే ఆయన పదవుల పందేరం నిర్వహించారు. కాని ఏనాడు తెలంగాణ కనీసం ఆలోచన చేసిన నాయకుడు కాదు. అందుకే ఈసారి బిఆర్‌ఎస్ అవకాశం ఇచ్చినా, బిఆర్‌ఎస్ పాలన చూసి ప్రజలు ఎన్నుకున్నా ఆయన చేసిందేమీ లేదన్నది ప్రజలు చెబుతున్న మాట. అందుకే ఈసారి దానంకు టికెట్ బిఆర్‌ఎస్ నుంచి ఇవ్వడం లేదన్న వార్తలు వినిపిస్తూనే వున్నాయి. అందుకే ఆయన ఎప్పటిలాగే మరో దారి కోసం ఎదురుచూస్తున్నట్లు..మరో వైపు చూస్తున్నట్లు..విశ్వసనీయ సమాచారం. ఎందుకంటే పదవి లేకుండా దానం వుండలేదు. పదవి పదవి కోసం ఏ పార్టీలోకైనా వెళ్లేందుకు సిద్దం. కాకపోతే ఈ పార్టీలోకి వెళ్లినా ఖైరతాబాద్ నుంచి ఆయన మరోసారి గెలిచే అవకాశం లేదన్నది మాత్రం ప్రజల మనోగతం.