ప్లాస్టిక్ మరియు మాంసపు వ్యర్థలతో పరిసరాలు
వర్షం పడితే భరించలేని దుర్వసన
పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో గల దామెర చెరువు పూర్తిగా కలుషితమైపోతుంది.గత ప్రభుత్వంలో 380 లక్షల తో పునరుద్దరణ మరియు మినీ ట్యాంక్ బండుగా పనులు ప్రారంభమాయ్యాయే తప్ప పునరుద్దరరికణ విషయంలో మాత్రం వెనకబడి పోయింది.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పనులు ప్రారంభ దిశలోనే ఉన్నాయే గాని ముందుకు సాగడం లేదని చెప్పవచ్చు.
ప్లాస్టిక్,మాంసపు వ్యర్దాలతో పరిసరాలు
దామెరా చెరువు ప్లాస్టిక్ మరియు మాంసపు వ్యర్థలతో పరిసరాలు దర్శనమిస్తున్నాయి.బేకరీలు,ఫంక్షన్ హాలులలో కూల్ డ్రింక్ షాపులలో వివిధ వ్యాపార అవసరాలకు ఉపయోగించే ప్లాస్టిక్ కవర్లు,గ్లాసులు,ప్లేట్స్, వాడిపడేసిన వాటర్ బాటిల్లు కుప్పలు తెప్పులుగా కనిపిస్తున్నాయి.చికెన్,చేపల షాపులలో మిగిలిన పనికిరాని కలేబరాల వ్యర్థలను చెరువు పరిసరాల సమీపంలోకి తీసుకువచ్చి వ్యాపారస్థులు పాడవేసి వెళ్తున్నారు.పండ్ల దుఖనాలలో తాగిపడేసిన కొబ్బరిబోండాలకైతే కొడవేలేదు నీళ్లలో చెరువు గట్టుమీద ఎక్కడ చూసిన అవే దర్శనమిస్తున్నాయి.హాస్పిటల్లో,మెడికల్ షాపులలో గడువు దాటినా మందులను,పాతపడిన దుస్తులను కూడా చెరువు నీళ్లలో విచ్చల విడిగా పారవేస్తున్నారు.
వర్షం పడితే భరించలేని దుర్వసన
చినుకు పడితే చాలు చెరువు కట్ట పరిసరాలు అనేక రకాల వ్యర్థలతో భరించలేని దుర్వసన వస్తుందని గత వర్షాకాలం సమయంలో రోజు నరకం అనుభవించామని పండగ వస్తే తప్ప పాలకులు ఇతర సమయాలో చెరువును గాని పరిసరాలను గాని పట్టించుకునే పరిస్థితి లేదని చెరువును పునరుద్దరికరణ చేయించి దుర్వసన నుండి రోగాలు తెచ్చిపెట్టే దోమలనుండి వచ్చే రోగాల బారినపడకుండా తమను విముక్తిలుగా చేయాలనీ పునరుద్దికరణ పనులు వీలైనంత తొందరగా చేపట్టి పూర్తి చేయాలనీ చెరువు పరిసరాలలో విచ్చలవిడిగా వ్యర్థలను,ప్లాస్టిక్ సంబంధిత వస్తువులను పడవేయకుండా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రజా ప్రతినిధులను,అధికారులను స్థానిక ప్రజలు కోరుతున్నారు.