ఎస్సీ వర్గీకరణ తో దళితుల ఐక్యత విచ్ఛిన్నం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె. నర్సింగ్
శ్రీరాంపూర్,మంచిర్యాల నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లోని ఎయిమ్స్ స్కూల్ లో తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం యూత్ విభాగం ముఖ్య నాయకుల సమావేశం బింగి సదానందం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.నర్సింగ్ పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలోని మతోన్మాద బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ చేతిలో కీలుబొమ్మగా మారి ఎస్సీ వర్గీకరణ పేరుతో విభజించి పాలిస్తూ దళితుల ఐక్యతను దెబ్బతీస్తూ మనువాదాన్ని ముందుకు తీసుకెళ్తూ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్న తరుణంలో ఆర్ఎస్ఎస్ బిజెపి నరేంద్ర మోడీ అడుగులకు, మడుగులకు ఎస్సీ వర్గీకరణ చేయాలని పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగని వారి ప్రయోగశాలలో ఒక వస్తువుగా వాడుకుంటున్నారు.అనే నగ్న సత్యాన్ని తెలిసి కూడా వారి స్వార్థ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం ఎస్సీ వర్గీకరణ కావాలని అసెంబ్లీలో బిల్లు పెట్టే విధంగా ఆ బిల్లును ఆమోదించేలా చేయడం దళితుల ఐక్యతను దెబ్బ తీయడమే అని అన్నారు. ముఖ్యంగా మాల ఉపకులాలకు అన్యాయం చేయడమేనని,ఈ రాష్ట్రంలో ఎస్సీ కులాల జనాభా లెక్కలు లేవని 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ వర్గీకరణ చేయడం బీజేపీ రాజకీయంగా కుట్ర చేసిందని రాజ్యాంగాన్ని మార్చి కుట్ర చేయడం లేదని మనువాదాన్ని ముందుకు తీసుకువెళ్లడం లేదని దళితుల ఐక్యతను ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసే కుట్రలు చేయకపోతే బిజెపి పాలిత రాష్ట్రాలలో ముందుగా ఎస్సీ వర్గీకరణ చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం గా ప్రశ్నిస్తున్నాము.ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.బిజెపి ప్రభుత్వాన్ని వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో బిజెపికి మరియు మాదిగ సోదరులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లుగా ఉందని ఇది కేవలం ఓట్ల రాజకీయ కోసం మాత్రమే ఇకనైనా రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న వర్గీకరణ ఆమోద బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.