పోలీసు శాఖలో కులవివక్షపై
సీఎం స్పందించాలి
కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి గుర్రం దేవేందర్
భూపాలపల్లి నేటిధాత్రి
చట్టాలు అమలు చేసే స్థానాల్లో ఉన్న పోలీసు శాఖలో కుల వివక్ష వేధింపులు ఉండటం వల్లే దళిత ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకుని మరణించాడని ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్పందించాలని, సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి గుర్రం దేవేందర్ డిమాండ్ చేశారు దళిత ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యపై మాట్లాడుతూ అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ 25 రోజుల కిందటనే తను ఎదుర్కొన్న వివక్ష వేధింపులపై జిల్లా ఎస్పీకి లిఖిత పూర్వకంగా పిర్యాదు చేసిన ఫలితం లేదు కుల వివక్ష వేధింపులను వివరించాడని పోలీసు ఉన్నతాధికారులు సరైన సమయంలో స్పందించకపోవడం వల్లే దళిత ఎస్సై ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు సీఐ జితేందర్ రెడ్డి కానిస్టేబుళ్లు కొందరు వేధించిన తీరు వల్లే మనస్తాపానికి లోనయ్యి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చిలుపాక మల్లయ్య దొడ్డే రవికుమార్ గుర్రం శ్రీనివాస్ రాజు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.