
దళిత జర్నలిస్టుల ఫోరం వ్యవస్థాపకులు కాషాపోగు జాన్.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని బుధవారం విలేకరుల సమావేశంలో దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కాషాపోగు జాను మాట్లాడుతూ, గత బి ఆర్ ఎస్ ప్రభుత్వము 10 ఏళ్ల పాలనలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని దళితులకు ఏ రోజు కూడా ప్రెస్ అకాడమిక్ లో గాని దళితులకు అవకాశం కల్పించిన దాఖలు లేవని దళితులను కొంతమంది నాయకులు వాడుకొని వదిలేయడం జరుగుతుంది దళిత జర్నలిస్టులు అందరం ఏకమై ఒక తాటిపై నిలిచి మన హక్కుల కోసము పోరాటం చేసే దిశగా ప్రయత్నం చేద్దామని ఆయన అన్నారు గత ప్రభుత్వము లో దళిత జర్నలిస్టులకు దళిత బంధుస్తామని దళితులను తీవ్ర అన్యాయం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, ఇక రానున్న రోజుల్లో దళితులు ఒకరి చేతుల్లో మోసపోకూడదని అవమానాలు పాలు కాకూడదని ఇకనుండి దళిత జర్నలిస్టులను ఎవరు మోసం చేసిన కించపరిచిన దళితులను అవహేళన చేసిన దళిత జర్నలిస్టుల పై దాడులు జరిగిన వహించేది లేదని ఎంతటి వారినైనా శిక్షించబడతారని కాషాపోగు జాను ప్రభుత్వానికిడిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో దళిత జర్నలిస్టుల ఫోరం పెబ్బేరు మండల ప్రెసిడెంట్ గాడిమూడి మన్యం, వైస్ ప్రెసిడెంట్ గోపి వారి రామకృష్ణ, దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర నాయకుడు పెద్దిగారి స్వామి, దళిత జర్నలిస్టుల పోరం సీనియర్ నాయకులు చింతకుంట బీసన్న, పెద్దిగారి రంజిత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.