భూపాలపల్లి నేటిధాత్రి
గత ప్రభుత్వంలో వెనుకబడిన ఎస్సీ మాదిగ, ఎస్సీ మాల కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుదల కొరకు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దృష్టిలో పెట్టుకొని దళిత బంధు పథకం ద్వారా అర్హులైన పేద,మధ్యతరగతి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఆర్థికంగా ప్రకటించి వారి అకౌంట్ లో డబ్బులు జమచేసారు కావున ఈ పథకం కొరకు ఎన్నికల ముందు దరఖాస్తులు చేసుకున్నాం దయచేసి మమల్ని అర్హులుగా గుర్తించి ఈ దళితబందు పథకాన్ని కొనసాగించి మాకు బతుకుదెరువు చూపించాలని కలెక్టర్ కార్యాలయం ముందు నిరసనకు సంఘీభావం తెలిపిన భూపాలపల్లి మున్సిపల్ కౌన్సిలర్,గండ్ర హరీష్ రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అధ్యక్షులు అంకం రాజేందర్, మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో రేగొండ మండల దళితులు ముద్దామల్ల సమ్మయ్య, దాట్ల రాజేందర్ బుడుదూల సుధాకర్, ల్యాదల్ల వీరాస్వామి,దాట్ల భద్రయ్య, దాట్ల రమేష్,గుర్రం కర్ణాకర్,దండ్రే మహేందర్, గుర్రం తిరుపతి,నార్లపూరం నరేష్ దొడ్డె పోషయ్య, దాట్ల కమలాకర్,అనిల్, నితిన్ రమేష్ సామి మొగిలి తదితరులు పాల్గొన్నారు