దళిత బంధు రెండో విడుత వెంటనే విడుదల చెయ్యాలి

హుజురాబాద్ :నేటిధాత్రి

మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్

శనివారం హుజరాబాద్ లోని వారి నివాసంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోనే అతి పేద కుటుంబాలు అంటే దళిత కుటుంబాలే అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు వారి కుటుంబాలను ఉపాధి ద్వారా ఆదుకోవాలని ఒక ఆలోచనతో దళిత బంధు పథకాన్ని 10 లక్షల ఆర్థిక సహాయంతో బ్యాంకుతో సంబంధం లేకుండా నేరుగా వారికి ఎలాంటి షరతులు లేకుండా ఈ పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గం లో పైలెట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇందులో దాదాపుగా 18021 మంది దళిత కుటుంబాలు ఈ పథకానికి అర్హులయ్యారు. ఈ కుటుంబాలకు గత ప్రభుత్వంలో దళిత బంధు మొదటి విడతగా ఒక్కొక్కరికి సుమారు 5 లక్షల రూపాయలు మొదటి విడతగా ఇవ్వడం జరిగింది. ఇందులో కొంతమంది వాహనాలను మరికొంతమంది షాపులను డైరీ ఫామ్ ఈ పథకం ద్వారా వినియోగించడం జరిగింది.2023 అక్టోబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికల రావడం ద్వారా ఈ పథకానికి సంబంధించిన రెండో విడత ఎలక్షన్ కమిషన్ ఆపివేయడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం 10 లక్షల ఇచ్చింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దళితులకు 12 లక్షలు ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్న కనీసం 12 లక్షలు ఇవ్వకపోవడం కాకుండా రెండో విడతగా వారి అకౌంట్లో ఉన్న డబ్బులను ఫ్రీజ్ చేయించి రెండో విడతను దళితులకు ఇవ్వకుండా వారిని ఇబ్బందులు పెడుతున్నారు. రెండో విడత డబ్బులు రాక వారిలో కొంతమంది వాహనాలకు బాడీ కట్టించుకోలేని పరిస్థితి బండి నడిస్తేనే గాని ఆ కుటుంబాలకు తిండి దొరకని పరిస్థితి మరికొంతమంది వారి షాపులకు అద్దె కట్టలేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారని ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి దళిత బంధు రెండో విడతను విడుదల చేయాలని దళితుల పక్షాన మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఇన్ని రోజులు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ను నియమించకపోవడం ఇప్పుడు నియమించిన తర్వాత కూడా స్పందించకపోవడం చాలా సిగ్గుచేటని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఆయన వెంట బిఆర్ఎస్ నాయకులు , మోరె మధు మంద రాజేష్ ,శంకర్ ,చంద్రమౌళి, ,రమేష్ , నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!