
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి కెవిపిఎస్ జిల్లా కమిటీ సమావేశంలో.రాష్ట్ర సహాయ కార్యదర్శి మంద సంపత్ మాట్లాడుతూ సమాజంలో దళితులు నేటికీ అనేక వివక్షతలను ఎదుర్కొంటూ బ్రతుకుతున్నారని తెలంగాణలో 18 శాతం గా ఉన్న దళితులకు కేవలం రెండు శాతం మాత్రమే భూమి కలిగి ఉన్నారని.. కొద్దిమంది చేతుల్లో భూమి కేంద్రీకృతమై ఉందన్నారు. భూమి లేకపోవడం వలన దళితులు వ్యవసాయ కూలీలుగా, కార్మికులుగా, పారిశుద్ధ పని వారిగా, అసంఘటిత రంగ కార్మికులుగా, డ్రైవర్లుగా, 4వ తరగతి ఉద్యోగులుగా బ్రతుకుతున్నారన్నారు. అలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి గత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పారదర్శకంగా అమలు చేయాలని, ప్రభుత్వం జిల్లాలోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళిత బంధు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం.. కేటాయించిన 17.700 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేసి దళిత బంధు కేటాయింపులో రాజకీయ నాయకుల జోక్యం గత ప్రభుత్వంలో కాకుండా ప్రభుత్వ అధికారుల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి నియోజకవర్గాల దళితులందరికీ మొదట చెప్పిన విధంగా దళిత బంధు ఇవ్వాలని కోరుతూ పిల్ల మున్సిపల్ పరిధిలో ఉన్న అన్ని జిల్లా మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో మండల కేంద్రాల్లో గ్రామస్థాయిలో సర్వేలు చేసి నిజమైన లబ్ధిదారులను సూచిస్తామని అధికారులు వాటిని పరిశీలించి ఇవ్వాలని అన్నారు. వెంటనే నిధులు విడుదల చేసి లబ్ధిదారులను ఎంపిక చేసి దళిత బంధువులతో భూపాల్ పల్లి జిల్లాలో ప్రతి దళిత కుటుంబానికి 58 జీవో ప్రకారం 125 గజాల స్థలం ఇచ్చి పక్క ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వాలని… లేనిచో కెవిపిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు మహేందర్, ప్రధాన కార్యదర్శి గుర్రం దేవేందర్, జిల్లా కమిటీ సభ్యులు శ్రీధర్, చందు, శ్రీనివాస్, బుచ్చయ్య, లక్ష్మణ్, సారయ్య తదితరులు మండల నాయకులు పాల్గొన్నారు