రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కుకు కృతజ్ఞతలు
దళిత బందు సాధన సమితి జిల్లా అధ్యక్షులు సంపత్ మహారాజ్ తెలియజేశారు.
మలహార్ రావు. నేటిధాత్రి :
దళిత బంధు నిధులు విడుదల పై ‘భట్టి’కి కృతజ్ఞతలు దళిత బంధు రెండవ విడత నిధుల మంజూరి పత్రాలను, చెక్కులను ఖమ్మం జిల్లాలోని మధిర నియెాజకవర్గం చింతకాని, నాగులవంచ మండల దళితులకు అందజేసిన ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కులకు దళిత బందు సాధన సమితి జిల్లా అధ్యక్షులు సంపత్ మహారాజ్ కృతజ్ఞతలు తెలిపారు. మంథని నియెాజకవర్గం నుండి మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న దుద్దిళ్ళ శ్రీధర్ బాబు దళితబంధు లబ్దిదారుల పక్షాన ప్రత్యేక చోరవ చూపి నిధులు మాంజురి చేయిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. దళతబంధు పథకం ద్వార లబ్దిదారులుగా ఎంపిక అయిన తర్వత ఎన్నికల కోడ్ రావటం వలన దళితబంధు అమలుకు అంతరాయం కలిగిందన్నారు. మంథని నియోజకవర్గంతో పాటు మిగతా నియెాజకవర్గాలలో జిల్లా కలక్టర్ల ఖాతాలలో ఉన్న నిధులను విడుదల చేసి దళితబంధు లబ్దిదారుల ఖాతాలోకి జమ చేసి గ్రౌండింగ్ చేయించేలా మంత్రి చొరవ చూపాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.