శ్రీ చైతన్య,నారాయణ కాలేజీలు మూసివేయాలని (డి ఎస్ యు) రాష్ట్ర కో కన్వీనర్ సదానందం డిమాండ్ చేశారు.
వీణవంక, (కరీంనగర్ జిల్లా),
నేటిదాత్రి:భువనగిరి-వైష్ణవి,భవ్య ,సూర్యాపేట-దగ్గుపాటి.వైష్ణవి,మాదాపూర్ నారాయణ IIT అకాడమీ-టి. వినయ్ విద్యార్థుల ఆత్మహత్యలకు కారకులైన అధికారులను శిక్షించాలని, విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని డీ ఎస్ యు నాయకులు వీణవంక మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది..
సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లి సమీపంలోని ఇమాంపేట
సాంఘిక సంక్షేమ బాలికల కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న దగ్గుబాటి వైష్ణవి ఆత్మహత్యపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించి దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోని కఠినంగా శిక్షించాలని ధర్మ స్టూడెంట్స్ యూనియన్ వీణవంక మండల కమిటీ బాధ్యులు డిమాండ్ చేశారు. వీణవంక మండల కేంద్రంలో సోమవారం నిరసన వ్యక్తం చేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరమని హత్య చేసి ఆత్మహత్యగా
చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దగ్గుబాటు వైష్ణవి ఆత్మహత్యపై విచారణ జరిపించి ఆ కుటుంబానికి న్యాయం చేయకపోతే ధర్మ స్టూడెంట్స్ యూనియన్ ( డి ఎస్ యు)ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో మండలాల్లో నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ధర్మ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర కో కన్వీనర్ సదానందం, వీణవంక మండల(డి ఎస్ యు) కన్వీనర్ వినయ్, సాగర్, రవికిరణ్,పృధ్వీరాజ్,సాయికిరణ్ ఇంటర్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.